AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా ఎంపీ ఫండ్స్ ని కరోనాపై పోరుకే వినియోగించా’.. శశిథరూర్

ఎంపీ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీమ్ (ఎంపీ ల్యాడ్స్) ను కేంద్రం రద్దు చేయకముందు తను ఈ నిధులను ఎలా వినియోగించానో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివరించారు. (కరోనాను ఎదుర్కొనేందుకు వనరుల సేకరణకు గాను రెండేళ్ల పాటు ఈ పథకాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.) కానీ ఈ పథకం కింద నిధులను ఎలా వినియోగించిందీ శశిథరూర్ ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. కరోనా పరీక్షల్లో వినియోగించేందుకు వెయ్యి రాపిడ్ టెస్టింగ్ కిట్లు, మరో […]

'నా ఎంపీ ఫండ్స్ ని కరోనాపై పోరుకే వినియోగించా'.. శశిథరూర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 4:52 PM

Share

ఎంపీ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీమ్ (ఎంపీ ల్యాడ్స్) ను కేంద్రం రద్దు చేయకముందు తను ఈ నిధులను ఎలా వినియోగించానో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివరించారు. (కరోనాను ఎదుర్కొనేందుకు వనరుల సేకరణకు గాను రెండేళ్ల పాటు ఈ పథకాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.) కానీ ఈ పథకం కింద నిధులను ఎలా వినియోగించిందీ శశిథరూర్ ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. కరోనా పరీక్షల్లో వినియోగించేందుకు వెయ్యి రాపిడ్ టెస్టింగ్ కిట్లు, మరో వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ కిట్ల కోసం ఈ ఫండ్స్ ఖర్చు చేయడం జరిగిందన్నారు, ఇవే గాక మరో వెయ్యి రాపిడ్ టెస్టింగ్ కిట్లు బుధవారం అధికారులకు అందుతాయని, అలాగే ఏడున్నర వేల పర్సనల్ ఈక్విప్ మెంట్ కిట్లు వచ్ఛే వారం అందనున్నాయని పేర్కొన్నారు. ఎంపీల వేతనాల్లో కోత విధించాలన్న నిర్ణయం మంచిదేనని, కానీ నిధులను రెండేళ్ల పాటు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మళ్ళించడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

‘ఉదాహరణకు రూ. 157 కోట్ల డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్స్ ను కేంద్రం కేరళకు కేటాయించింది.. ఈ రాష్ట్రంలో 314 కరోనా కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కేవలం 122 కేసులే నమోదై ఉన్న గుజరాత్ రాష్ట్రానికి రూ. 662 కోట్లను కేటాయించారు. ఈ రకమైన అసమానత కొన్ని సమస్యలకు దారి తీస్తుంది.. మళ్ళీ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కేటాయింపు విషయానికి వచ్ఛేసరికి ఆ ప్రక్రియమీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని శశిథరూర్ వివరించారు.