ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూయెల్ జోక్.. సర్కార్‌పై సోనియా ఆగ్రహం

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఒక క్రూయెల్ జోక్‌గా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కరోనాను ఎదుర్కోవడంతో మోదీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి సంసిద్దత లేకుండా లాక్ డౌన్ అమల్లోకి తేవడం, దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక మోదీ ప్రభుత్వం గందరగోళ విధానాలను అవలంభిస్తోందని సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన జాతీయ స్థాయి […]

ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూయెల్ జోక్.. సర్కార్‌పై సోనియా ఆగ్రహం
Follow us

|

Updated on: May 22, 2020 | 4:43 PM

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఒక క్రూయెల్ జోక్‌గా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కరోనాను ఎదుర్కోవడంతో మోదీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి సంసిద్దత లేకుండా లాక్ డౌన్ అమల్లోకి తేవడం, దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక మోదీ ప్రభుత్వం గందరగోళ విధానాలను అవలంభిస్తోందని సోనియా గాంధీ విరుచుకుపడ్డారు.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన జాతీయ స్థాయి విపక్షాల సమావేశంలో సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె సునిశిత విమర్శలు చేశారు. ‘‘మార్చి 24వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారు.. ఎలాంటి సంసిద్ధత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు.. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయి.. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేస్తూ బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోంది.. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయి.. టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.. ఈలోగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉంది.. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజి ఒక క్రూయెల్ జోక్‌గా నిలిచింది.. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు..’’ అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సోనియా గాంధీ.

ఇదిలా వుంటే.. కాంగ్రెెస్ పార్టీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన విపక్షాల సమావేశానికి సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు దూరంగా వున్నాయి. యూపీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, డిఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్, ఉమర్ అబ్దుల్లా, సీతారామ్ ఏచూరీ, ప్రొ.కోదండరామ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.