AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరింత పడిపోయిన రూపాయి విలువ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు తగ్గింపుతో దేశీయ కరెన్సీ రూపాయి కుప్పకూలింది. డాలరు మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపుతో పోల్చితే శుక్రవారం 34 పైసలు క్షిణించి 75.95 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి 76 కనిష్ఠ స్థాయికి చేరువైంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ ప్రకటించిన రెపో రేట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ను బలహీన పర్చాయి. మార్కెట్‌వర్గాల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ […]

మరింత పడిపోయిన రూపాయి విలువ
Balaraju Goud
|

Updated on: May 22, 2020 | 4:38 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు తగ్గింపుతో దేశీయ కరెన్సీ రూపాయి కుప్పకూలింది. డాలరు మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపుతో పోల్చితే శుక్రవారం 34 పైసలు క్షిణించి 75.95 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి 76 కనిష్ఠ స్థాయికి చేరువైంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ ప్రకటించిన రెపో రేట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ను బలహీన పర్చాయి. మార్కెట్‌వర్గాల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.72 వద్ద బలహీనంగా ప్రారంభమై.. మరింత క్షీణించి చివరికి 75.95 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల బలహీనతకు తోడు, అమెరకా డాలరు బలం, దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావాన్ని చూపాయంటున్నారు ట్రేడర్లు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను RBI వెల్లడించకపోవడం దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. లాక్ డౌన్ తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా.. వడ్డీ రేట్లను తగ్గించింది. రుణాల చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. అలాగే నాలుగు దశాబ్దాల్లో మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్రయత్నంలో బ్యాంకులకు కార్పొరేట్‌ ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అనుమతించింది.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు