AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారికి బీరు తాగించిన తండ్రి అరెస్ట్

తన ఏడాది కొడుకుతో బీరు తాగించిన తండ్రి, అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. కాగా గతేడాది ఓ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. ఆ క్రమంలోనే తన ఒళ్లో కూర్చున్న మూడేళ్ల కొడుక్కి కూడా బీరు తాగించాడు. దీన్ని అక్కడే కూర్చున్న స్నేహితులు షూట్ చేసి.. ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. అది కాస్త వైరల్‌గా […]

చిన్నారికి బీరు తాగించిన తండ్రి అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2019 | 7:05 AM

Share

తన ఏడాది కొడుకుతో బీరు తాగించిన తండ్రి, అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది.

కాగా గతేడాది ఓ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. ఆ క్రమంలోనే తన ఒళ్లో కూర్చున్న మూడేళ్ల కొడుక్కి కూడా బీరు తాగించాడు. దీన్ని అక్కడే కూర్చున్న స్నేహితులు షూట్ చేసి.. ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారడంతో ఈ వీడియో చూసిన బాలల హక్కుల సంఘాలు తీవ్రస్థాయిలో తండ్రిపై మండిపడి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని గుర్తించిన పోలీసులు తండ్రితో పాటు అతడి ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు.