AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామా ఉగ్రదాడికి ఉపయోగించిన వాహనం గుర్తింపు

పుల్వామా ఉగ్రదాడిలో ఉపయోగించిన వాహనాన్ని.. దాని యజమానిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో ఈ కీలక అంశాన్ని కనుగొన్నారు. ఉగ్రదాడిలో ఉపయోగించిన వాహనం మారుతీ ఎకో. ఆ వాహనం యజమాని పేరు సజ్జత్ భట్‌గా గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్‌కు చెందిన సజ్జత్‌ దగ్గరికి ఈ వాహనం వచ్చే ముందు ఏడుగురి చేతులు మారిందని వారు పేర్కొన్నారు. అలాగే ఘటన జరిగిన పది రోజుల ముందే ఈ వాహనాన్ని […]

పుల్వామా ఉగ్రదాడికి ఉపయోగించిన వాహనం గుర్తింపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2019 | 7:18 AM

Share

పుల్వామా ఉగ్రదాడిలో ఉపయోగించిన వాహనాన్ని.. దాని యజమానిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో ఈ కీలక అంశాన్ని కనుగొన్నారు.

ఉగ్రదాడిలో ఉపయోగించిన వాహనం మారుతీ ఎకో. ఆ వాహనం యజమాని పేరు సజ్జత్ భట్‌గా గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్‌కు చెందిన సజ్జత్‌ దగ్గరికి ఈ వాహనం వచ్చే ముందు ఏడుగురి చేతులు మారిందని వారు పేర్కొన్నారు. అలాగే ఘటన జరిగిన పది రోజుల ముందే ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు నుంచి అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సజ్జత్ భట్.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అనుమానిస్తున్నారు. ఆయుధాలు పట్టుకొని భట్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.