AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారిని అలా చూడటం నన్ను కలిచివేస్తోంది

తను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానన్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలిచివేస్తోందని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున దక్షిణాసియా ప్రాంతంలో హెపటైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అమితాబ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. మహిళలను ఏ విషయంలోనైనా తక్కువ చేసి చూస్తే తనకు చాలా బాధేస్తుందన్నారు […]

వారిని అలా చూడటం నన్ను కలిచివేస్తోంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2019 | 6:25 AM

Share

తను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానన్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలిచివేస్తోందని తెలిపారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున దక్షిణాసియా ప్రాంతంలో హెపటైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అమితాబ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. మహిళలను ఏ విషయంలోనైనా తక్కువ చేసి చూస్తే తనకు చాలా బాధేస్తుందన్నారు అమితాబ్ బచ్చన్. ఈ దేశానికి సగం శక్తి మహిళలే అని ఆయన అన్నారు.