ఈఎస్ఐ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

ఈ.ఎస్.ఐ. స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇందులో భాగంగా స్కామ్‌లో ప్రధాన నిందితురాలైన దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్‌మెంటును గురువారం ఈడీ అధికారులు...

ఈఎస్ఐ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం
Follow us

|

Updated on: Sep 17, 2020 | 2:02 PM

ఈ.ఎస్.ఐ. స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇందులో భాగంగా స్కామ్‌లో ప్రధాన నిందితురాలైన దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్‌మెంటును గురువారం ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవికారాణి హైదరాబాద్ నగరంలోని పీ.ఎం.జే. జెవెల్లరీస్‌లో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు సంబంధించిన వివరాలు రాబట్టారు అధికారులు.

ఈఎస్ఐ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ అధికారులు, గురుమూర్తి స్టేట్ మెంట్ రికార్డు చేయడంతోపాటు పీ.ఎం.జే. యజమానుల స్టేట్‌మెంటును కూడా రికార్డు చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాల దుకాణంలో దేవికారాణి ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ కొనుగోలుకు సంబంధించిన కూపీ లాగుతున్నారు. బంజారాహిల్స్ లోని పీ.ఎం.జే. నగల షాపు యజమానుల స్టేట్‌మెంటులో పలు కీలక అంశాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లు కొల్లగొట్టిన దేవికారాణి, ఆ రకంగా సంపాదించిన అవినీతి సొమ్మును మళ్లించడానికి అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క దేవికారాణి పేరుతోనే కాకుండా ఆమె కుటుంబీకులు, బంధువులుచ ఆమెకు కుంభకోణంలో సహకరించిన ఈఎస్ఐ అధికారుల పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.