8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ : వెంకయ్య నాయుడు
ఎనిమిది మంది విపక్ష రాజ్యసభ సభ్యుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు. సస్పెండ్ అయిన వాళ్లలో డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు కాగా, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు, ఏఐటీసీ నుంచి ఇద్దరు, ఒకరు ఆప్ సభ్యులు. కాగా, రాజ్యసభలో ఆదివారం విపక్ష […]

ఎనిమిది మంది విపక్ష రాజ్యసభ సభ్యుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు. సస్పెండ్ అయిన వాళ్లలో డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు కాగా, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు, ఏఐటీసీ నుంచి ఇద్దరు, ఒకరు ఆప్ సభ్యులు. కాగా, రాజ్యసభలో ఆదివారం విపక్ష ఎంపీల ప్రవర్తనను అధికారపక్షం సీరియస్ గా తీసుకుంది. రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్ కోరుతూ ఈ ఉదయం గం. 9.05 కు రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. రైతు బిల్లులపై ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు పోడియంలోకి దూసుకురావడం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దురుసు ప్రవర్తన కారణాలుగా చూపిస్తూ ఈ వేటు వేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ మార్షల్‌ను చేత్తో నెట్టేసిన ఘటనతోపాటు విపక్ష సభ్యుల చేసిన రసాభాసపై వీడియో ఫుటేజి పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు.



