AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండాతో కేకే.. మీటింగ్ మర్మమేంటో..?

ఆర్టీసీ సమ్మె, దానికి సంబంధించిన చర్చలు ఎలా వున్నా.. మంగళవారం ఓ అనూహ్యమైన భేటీ జరిగింది. ఆర్టీసీ చర్చలకు తాను మధ్యవర్తినవుతానని, కెసీఆర్ ఆదేశిస్తే చర్చలకు వెళతానని ప్రకటించిన టిఆర్ఎస్ ముఖ్య నేత, రాజ్యసభలో టిఆర్ఎస్ పక్షం నాయకుడు కే.కేశవరావును ఇవాళ మొన్నటి ఎన్నికలకు ముందు కెసీఆర్ తో విభేదించి టిఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. మంగళవారం అనూహ్యంగా కే.కే.తో భేటీ అయ్యారు. కారణం ఆర్టీసీ అంశమేనని కొండా చెప్పినప్పటికీ.. ఆయన […]

కొండాతో కేకే.. మీటింగ్ మర్మమేంటో..?
Rajesh Sharma
|

Updated on: Oct 15, 2019 | 6:32 PM

Share

ఆర్టీసీ సమ్మె, దానికి సంబంధించిన చర్చలు ఎలా వున్నా.. మంగళవారం ఓ అనూహ్యమైన భేటీ జరిగింది. ఆర్టీసీ చర్చలకు తాను మధ్యవర్తినవుతానని, కెసీఆర్ ఆదేశిస్తే చర్చలకు వెళతానని ప్రకటించిన టిఆర్ఎస్ ముఖ్య నేత, రాజ్యసభలో టిఆర్ఎస్ పక్షం నాయకుడు కే.కేశవరావును ఇవాళ మొన్నటి ఎన్నికలకు ముందు కెసీఆర్ తో విభేదించి టిఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. మంగళవారం అనూహ్యంగా కే.కే.తో భేటీ అయ్యారు. కారణం ఆర్టీసీ అంశమేనని కొండా చెప్పినప్పటికీ.. ఆయన కేకేని కల్వడం వెనుక వేరే కారణాలున్నాయన్న గుసగుసలు మొదలయ్యాయి.

ఆర్టీసీ యూనియన్లతో చర్చలు ఇక క్లోజ్ అయినట్లేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించినా.. తాను రాయభారం నడుపుతానని ప్రకటించడం ద్వారా ధిక్కార స్వరం వినిపించిన కేకేని అభినందించేందుకే కొండా ఆయన్ని కలిసినట్లు సమాచారం. అయితే.. మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన కేకే కు కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. అటు ఆర్టీసీ యూనియన్లు సైతం కేకే లేఖను స్వాగతించాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కేకే మధ్యవర్తిత్వంతో చర్చలు పున: ప్రారంభమవుతాయని అంతా అనుకున్నారు. కానీ సీన్ వేరేలా మారింది.

కేకే రాయభారానికి సీఎం ఓకే అనకపోవడంతో ఆయన సైలెంటైపోయారు. ఈక్రమంలో కేకేలో రెండో ఆలోచన రప్పించేందుకే కొండా.. కేకేని కలిశారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. టిఆర్ఎస్ లో సీనియర్ల మాటలకు ఇదీ వాల్యూ అని చెప్పినట్లు సమాచారం. ఏదైతేనేం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేశవరావుల భేటీ పొలిటికల్ సర్కిల్స్లో  సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. అయితే.. కేకేని కలిసిన కొండా కామెంట్స్ మాత్రం వేరేలా వున్నాయి.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయన్ను కలిశాను. ఆర్టీసీ సమస్యను అర్థం చేసుకొని మంచి మనసుతో ఆయన స్పందించారు. సమ్మె వల్ల అందరికీ నష్టమే. టీఆర్‌ఎస్‌కు కూడా రాజకీయంగా మైనస్సే. కానీ సీఎం మాత్రం మొండిగా ఉంటున్నారు. ఆయనకు పోలీస్‌శాఖ ఒక్కటే ఉంటే సరిపోతుందను​కుంటున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతామని కేకే చెప్పార’ని కొండా వెల్లడించారు.  

ఏది ఏమైనా ఇటీవలనే కెసీఆర్ తో విభేదించిన కొండాతో కేశవరావు భేటీ అవడం పార్టీలోను కలకలం రేపుతోంది. వీరిద్దరి భేటీని కేసీఆర్ ఎలా తీసుకుంటారో.. ఆయన తదుపరి స్టెప్ ఏంటీ అనే అంశాలపై గులాబీ శ్రేణుల్లో గుసగుసలు ఊపందుకున్నాయి.