అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి

అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన నదీ జలాల వివాద పరిష్కారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుకున్నట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని...

అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి
Follow us

|

Updated on: Oct 06, 2020 | 4:01 PM

Crucial decision in Apex council meeting today: అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన నదీ జలాల వివాద పరిష్కారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుకున్నట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలన్న నిర్ణయం ఒకటి. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.

మంగళవారం న్యూ ఢిల్లీ నుంచి గజేంద్ర షెకావత్, ఏపీ భవన్ నుంచి ముఖ్యమంత్రి జగన్, హైదరాబాద్ నుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి భేటీలో తీసుకున్న నిర్ణయాలను స్వయంగా వెల్లడించారు. ‘‘ 2014లో ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. విభజన చట్టం ప్రకారం జలవివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది.. 2016లో తొలి భేటీ జరిగింది. అనేక పర్యాయాలు వాయిదపడ్డ తర్వాత 2వ భేటీ ఇప్పుడు జరిగింది.. గోదావరి, కృష్ణ నదిపై ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డుల అంశాలపై చర్చ జరిగింది.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు సీఎంలు హాజరయ్యారు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు అన్నీ చర్చించాం.. వాటికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విషయంలో అడుగు ముందుకు పడింది.. బోర్డు అధికారాల పరిధిపై చర్చించాం .. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను అపెక్స్ కౌన్సిల్ ముందు సబ్మిట్ చేసేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారు… ’’ అని గజేంద్ర షెకావత్ మీడియాకు వివరించారు.

సమావేశంలో కృష్ణా రివర్ బోర్డు తరలింపుపై కూడా చర్చ జరిగిందని షెకావత్ తెలిపారు. కృష్ణా బోర్డు హైద్రాబాద్ నుంచి విజయవాడ మార్చడం గురించి సుదీర్ఘ చర్చ అనంతరం నిర్ణయం తీసుకున్నామని, ఇకపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంటు బోర్డు విజయవాడ నుంచి పని చేస్తుందని ఆయన ప్రకటించారు. గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డులను నోటిఫై చేశామని, దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిపినా.. కేంద్రానికి ఉన్న అధికారాల మేరకు నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అదే సమయంలో ట్రైబ్యునళ్ళ కేటాయింపుల మీద తెలంగాణ వేసిన కేసులను వెనక్కి తీసుకునే విషయంలో కేసీఆర్‌ను ఒప్పించామని, ఈ కేసును బుధవారమే వెనక్కి తీసుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని కేంద్ర మంత్రి వివరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ ఇకపై కేఆర్ఎంబీ మాత్రమే చూసుకుంటుదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదీజలాల పున: పంపిణీకి ట్రైబ్యునల్ వేయాలన్న అంశంపై ఇరు ముఖ్యమంత్రులు వినతులు పంపితే వేస్తామని షెకావత్ తెలిపారు.

Also read: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్

Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..