“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” సంచలన నిర్ణయం..!

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. 1925లో సంస్థ ప్రారంభమయ్యాక.. 1929 నుంచి ప్రతి ఏటా “సంఘ శిక్షా వర్గ” పేరుతో ట్రైనింగ్‌ క్యాంపులు జరుగుతుండేవి. అయితే గతంలో ఈ సంస్థపై నిషేధం ఉన్న సమయంలో మాత్రమే ఈ శిక్షణా శిభిరం జరగలేదు. అయితే తొలిసారిగా ఈ ఏడాది జరగాల్సిన సంఘ్ శిక్షా వర్గలు రద్దు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. ప్రతి […]

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంచలన నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 5:42 PM

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. 1925లో సంస్థ ప్రారంభమయ్యాక.. 1929 నుంచి ప్రతి ఏటా “సంఘ శిక్షా వర్గ” పేరుతో ట్రైనింగ్‌ క్యాంపులు జరుగుతుండేవి. అయితే గతంలో ఈ సంస్థపై నిషేధం ఉన్న సమయంలో మాత్రమే ఈ శిక్షణా శిభిరం జరగలేదు. అయితే తొలిసారిగా ఈ ఏడాది జరగాల్సిన సంఘ్ శిక్షా వర్గలు రద్దు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం నుంచి మే,జూన్ మాసల మధ్యలో ఈ శిక్షణా తరగతులు జరుగుతుండేవని.. సంస్థపై నిషేధం ఎత్తివేసిన అనంతరం.. ఈ శిక్షణా శిబిరాలను రద్దు చేయడం ఇదే తొలిసారి అని వైద్య తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్‌ వరకు సంఘ్ శిక్షా వర్గలు జరాగాల్సి ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మే,జూన్ నెలల్లో ఈ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించుకునే అవకాశం ఉన్నా..ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం.. ఈ సారి జరగాల్సిన క్యాంపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

2017-18 సంవత్సరంలో సంఘ్ నిర్వహించిన ట్రైనింగ్ క్యాంపులో 27,800 మంది పాల్గొన్నట్లు వైద్య తెలిపారు. ఇక 2018-19లో 29,500 మంది క్యాంప్‌లకు హాజరైనట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా..ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు పలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 26వేల ప్రాంతాల్లో 25 లక్షల కుటుంబాలకు సేవలందించినట్లు మన్మోహన్ వైద్య తెలిపారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..