బాబూ.. హైదరాబాద్‌కు అన్యాయం చేశావ్..!

ఛాన్సిస్తే చాలు హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేశానని, హైదరాబాద్ చరిత్రలో కులీ కుతుబ్ షా కంటే తానే ఎక్కువ అనే స్థాయిలో చెప్పుకునే చంద్రబాబు నిజానికి హైదరాబాద్‌కు తీరని అన్యాయం చేశారన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కంప్యూటర్ యుగం మొదలైన సందర్భంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు తప్ప.. అక్కడ ఐటి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు బుగ్గన. కంప్యూటర్ కంపెనీలకు భూములివ్వాల్సి వుండగా.. చంద్రబాబు […]

బాబూ.. హైదరాబాద్‌కు అన్యాయం చేశావ్..!
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 17, 2019 | 5:57 PM

ఛాన్సిస్తే చాలు హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేశానని, హైదరాబాద్ చరిత్రలో కులీ కుతుబ్ షా కంటే తానే ఎక్కువ అనే స్థాయిలో చెప్పుకునే చంద్రబాబు నిజానికి హైదరాబాద్‌కు తీరని అన్యాయం చేశారన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

కంప్యూటర్ యుగం మొదలైన సందర్భంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు తప్ప.. అక్కడ ఐటి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు బుగ్గన. కంప్యూటర్ కంపెనీలకు భూములివ్వాల్సి వుండగా.. చంద్రబాబు రహేజా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించి, వారి మధ్యవర్తిత్వం ద్వారా ఐటి కంపెనీలకు అధిక ధరలకు భవనాలు దొరికేలా చేశారని అందువల్లే పలు కంపెనీలు బెంగళూరుకు వెళ్ళిపోయాయని చెప్పారు బుగ్గన. నాలుగైదు పెద్ద కంపెనీలకు రహేజా లాంటి సంస్థల చేత అధిక ధరలకు భూములు ఇప్పించారని, ఆ ధరలను భరించలేని చిన్న సంస్థలు బెంగళూరుకు వెళ్ళిపోయాయని వివరించారు.

హైదరాబాద్ దేశ ఐటి భాగస్వామ్యంలో కేవలం 15 శాతానికే పరిమితమైందని అన్నారు బుగ్గన. హైదరాబాద్ స్థూల ఉత్పత్తి తెలంగాణలో 60 శాతం అని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, తెలంగాణ స్థూల ఉత్పత్తిలో హైదరాబాద్ వాటా కేవలం 24 శాతమేనని మంత్రి వెల్లడించారు.

కర్నాటకలో చిన్న చిన్న సంస్థలకు భూములు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తే.. అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టైలర్ మేడ్ ఒప్పందాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పుకొచ్చారు బుగ్గన.

హైదరాబాద్‌కు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, అవుటర్ రింగ్ రోడ్డులో కేవలం 28 కి.మీ. రోడ్డు మాత్రం చంద్రబాబు సమయంలో వచ్చిందని, శంషాబాద్ ఎయిర్ పోర్టు, పివి ఎక్స్‌ప్రెస్ హైవే, 150 కి.మీ.ల అవుటర్ రింగ్ రోడ్డు వంటివాటిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తానే మొదలు పెట్టి, తానే పూర్తి చేశారని అన్నారు.

నిజానికి హైదరాబాద్ హైటెక్ సిటీకి భూమి కేటాయించింది స్వర్గీయ కోట్ల విజయభాస్కర రెడ్డి కాగా.. చంద్రబాబు అంతా తానే చేసినట్లు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు బుగ్గన.