ఒక్కటి కాదు మూడు రాజధానులు.. జగన్ చెప్పేశారుగా..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి తనదైన శైలిలో వినూత్న పరిష్కారాన్ని చూపబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రెండు సంస్థల ద్వారా ఏపీ రాజధానిపై అధ్యయనం చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకటి, రెండు వారాల్లో ఈ రెండు రిపోర్టులు వస్తాయని, వాటిని సమీక్షించిన తర్వాత రాజధానిపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జగన్ వెల్లడించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భావితరాల బాగోగులను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని, తమ నిర్ణయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు వుండవని […]

ఒక్కటి కాదు మూడు రాజధానులు.. జగన్ చెప్పేశారుగా..!
Follow us

|

Updated on: Dec 17, 2019 | 6:30 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి తనదైన శైలిలో వినూత్న పరిష్కారాన్ని చూపబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రెండు సంస్థల ద్వారా ఏపీ రాజధానిపై అధ్యయనం చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఒకటి, రెండు వారాల్లో ఈ రెండు రిపోర్టులు వస్తాయని, వాటిని సమీక్షించిన తర్వాత రాజధానిపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జగన్ వెల్లడించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భావితరాల బాగోగులను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని, తమ నిర్ణయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు వుండవని జగన్ చెప్పారు.

రాజధాని పేరిట చంద్రబాబు భూబాగోతాలు నడిపారంటూ నిప్పులు చెరిగారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజధాని ప్రాంతంలో 4,070 ఎకరాలను తన బినామీలకు, తన వాళ్ళకు చంద్రబాబు కేటాయించారని జగన్ వివరించారు.

జగన్ తన ప్రసంగంలో దక్షిణ ఆఫ్రికా ఫార్ములాను ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వున్న సంగతిని తెలిపారు. అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు. ప్రస్తుతం వున్న అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామన్న హింట్ ఇచ్చారు ముఖ్యమంత్రి. విశాఖలో బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అదే విధంగా జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలు నగరాన్ని గుర్తించే అవకాశాలున్నాయన్నారు సీఎం జగన్.

అయితే.. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని, రాజధాని అంశంపై అధ్యయానికి నియమించిన రెండు కమిటీలు మరో రెండు వారాల్లో నివేదిక ఇస్తాయని, వాటిపై కూలకషంగా చర్చలు జరిపిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!