అమరావతి భూబాగోతం బట్టబయలు.. వెల్లడించిన బుగ్గన

అమరావతి ఏరియాలో తమకు భూములుంటే ఏ చర్య అయినా తీసుకోవచ్చని సవాల్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయే వివరాలు వెల్లడించారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సుమారు నాలుగు వేల ఎకరాలను చంద్రబాబు, ఆయన అనుచరులు, బంధువులు, పార్టీ నేతలు కొనుగోలు చేశారని పేర్లతో సహా వివరాలు వెల్లడించారు బుగ్గన. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ సంస్థకు 14.22 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి. బాలకృష్ణ వియ్యంకునికి […]

అమరావతి భూబాగోతం బట్టబయలు.. వెల్లడించిన బుగ్గన
Follow us

|

Updated on: Dec 17, 2019 | 5:22 PM

అమరావతి ఏరియాలో తమకు భూములుంటే ఏ చర్య అయినా తీసుకోవచ్చని సవాల్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయే వివరాలు వెల్లడించారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

సుమారు నాలుగు వేల ఎకరాలను చంద్రబాబు, ఆయన అనుచరులు, బంధువులు, పార్టీ నేతలు కొనుగోలు చేశారని పేర్లతో సహా వివరాలు వెల్లడించారు బుగ్గన. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ సంస్థకు 14.22 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి. బాలకృష్ణ వియ్యంకునికి 499 ఎకరాలను రాజధాని ప్రాంతంలో కేటాయించారని, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, రావెల కిశోర్ బాబు, లింగమనేని రమేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి తదితరులు తమ పేరిట, తమ బంధువుల పేరిట రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని వివరించారు.

మాజీ మంత్రి నారాయణః 55.27 ఎకరాలు లింగమనేని రమేష్ః 351.25 ఎకరాలు వేమూరి రవి కుమార్ః 62.77 ఎకరాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుః 38.84 ఎకరాలు

ఈ భూములను ముందు చౌకధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారని బుగ్గన అసలు సీక్రెట్‌ను బహిర్గత పరిచారు. స్థానికులు కాకుండా వేరే వాళ్ళు భూములు ఇక్కడ కొంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ అనకుండా ఇంకేమంటారని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. భూములను ఎలా పడితే బౌండరీలను మార్చేసుకున్నారని బుగ్గన ఆరోపించారు.

చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన చాలా మంది బినామీ పేర్లతో అమరావతి ఏరియాలో భూములు కొన్నారంటూ పెద్ద జాబితాను బుగ్గన చదివి వినిపించారు.

రాజధాని పేరిట సేకరించిన భూములను తమకు అనుకూలంగా వున్న వారికి తక్కువ ధరకు కేటాయించారని ఆరోపించారు. బ్యాంకులకు 4 కోట్ల రూపాయలకు ఎకరా కేటాయించిన గత ప్రభుత్వం.. తమకు అనుకూల విద్యాసంస్థకు కేవలం 20 లక్షల రూపాయలకు ఎకరాను కేటాయించిందని చెప్పారయన.

అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సింగపూర్ సంస్థలను భాగస్వామిగా చేర్చుకున్నారని ఆరోపించారు. రెండు ప్రభుత్వాల మధ్య రాజధాని ఒప్పందం అని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, నిజానికి రెండు ప్రైవేటు సంస్థల మధ్య ఒప్పందంగానే దాన్ని రూపొందించారని బుగ్గన వివరించారు.

స్విస్ ఛాలెంజ్ విధానం పేరిట చంద్రబాబు కథలు చెబుతున్నారని, ఆయన రూపొందించిన మాస్టర్ ప్లాన్ రాజధాని కోసం కాదని, కేవలం డబ్బులు దండుకోవడానికేనని ఆర్థిక మంత్రి ఆరోపించారు.