అమరావతి ఎంపిక అందుకే.. సీక్రెట్ రివీల్ చేసిన చంద్రబాబు
అయిదేళ్ళ క్రితం రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోతే…తాను అన్నీ ఆలోచించే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమరావతి ఒక ఆశగా కనిపించాలి, ఓ దిక్సూచిగా నిలవాలనే ఉద్దేశంతో దీని చుట్టూ సంపద సృష్టించాలన్న సంకల్పంతోనే అమరావతిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరు రోజున రాజధాని అంశంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. విజయవాడలో కేపిటల్ పెడుతున్నామని తాము […]
అయిదేళ్ళ క్రితం రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోతే…తాను అన్నీ ఆలోచించే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమరావతి ఒక ఆశగా కనిపించాలి, ఓ దిక్సూచిగా నిలవాలనే ఉద్దేశంతో దీని చుట్టూ సంపద సృష్టించాలన్న సంకల్పంతోనే అమరావతిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరు రోజున రాజధాని అంశంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. విజయవాడలో కేపిటల్ పెడుతున్నామని తాము చెప్పినప్పుడు అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా తమతో ఏకీభవించారని గుర్తు చేశారాయన. రాజధాని ఎక్కడన్నా పెట్టండి.. కానీ కనీసం 30వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ఆనాడు సూచించారని చెప్పారు చంద్రబాబు.
ఈసందర్భంలో జరిగిన గందరగోళంతో చంద్రబాబు చిరాకు పడ్డారు. హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు చంద్రబాబు.
అమరావతి ఎంపిక ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దృష్టి ఏర్పాటు చేశారన్న ప్రచారాన్ని ఖండించారు. అమరావతి ఏరియాలో బలహీన వర్గాలే అధిక సంఖ్యలో వున్నాయన్నారు చంద్రబాబు. వెస్టెడ్ ఇంట్రెస్టులున్నాయి కాబట్టే అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు సభలో దుమారాన్ని రేపాయి.
అమరావతి ఏరియాలో తన వాళ్ళకు భూములున్నాయన్న ఆరోపణలో నిజం లేదని, అలా వుంటే ఏ చర్య అయినా ప్రభుత్వం తీసుకోవచ్చని చంద్రబాబు సవాల్ చేశారు.