బాబుపై పంచ్‌లే పంచ్‌లు.. ఆఖరుకు స్పీకర్ కూడా..
రాజధాని అంశం మంగళవారం ఏపీ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. రాజధాని ఎంపికపై ప్రసంగించిన చంద్రబాబు పలు అంశాలను సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తావించిన అంశాలతో విభేదించిన పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాబుపై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డారు. తొలుత చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ తన అకౌంట్‌లో వేసుకోవడంపై మంత్రి కొడాలి నాని అభ్యంతరం పెట్టారు. చంద్రబాబు పుట్టక ముందే హైదరాబాద్ నగరం జాతీయ స్థాయిలో అయిదో నగరం అని నాని గుర్తు […]
రాజధాని అంశం మంగళవారం ఏపీ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. రాజధాని ఎంపికపై ప్రసంగించిన చంద్రబాబు పలు అంశాలను సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తావించిన అంశాలతో విభేదించిన పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాబుపై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డారు. తొలుత చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ తన అకౌంట్‌లో వేసుకోవడంపై మంత్రి కొడాలి నాని అభ్యంతరం పెట్టారు. చంద్రబాబు పుట్టక ముందే హైదరాబాద్ నగరం జాతీయ స్థాయిలో అయిదో నగరం అని నాని గుర్తు చేశారు.
మరో దశలో ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించడం విశేషం. శ్రీకాకుళం జిల్లాకు ఐఐఐటి ఇచ్చిన ఘనత తనదేనన్న చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు తమ్మినేని. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలోనే శ్రీకాకుళానికి ఐఐఐటి ఇవ్వాలని ప్రతిపాదించారని స్పీకర్ గుర్తు చేశారు.
రాజధాని సెంట్రలైజ్డ్‌గా వుండాలన్న చంద్రబాబు వ్యాఖ్యలతోను స్పీకర్ తమ్మినేని విభేదించారు. విశాఖ నగరానికి రాజధాని కావడానికి విజయవాడ కంటే ఎక్కువ వనరులున్నాయని, కనెక్టివిటీలోను విజయవాడ కంటే విశాఖ నగరమే బెటరని తమ్మినేని చెప్పారు. రాజధాని సెంట్రలైజ్డ్‌గా వుండడం కంటే.. వికేంద్రీకరించడమే బెటరన్నఅభిప్రాయాన్ని తమ్మినేని వ్యక్తం చేయడం విశేషం.