అన్నంత పని చేసిన హర్షకుమార్.. సుప్రీం ముందుకు బోటు యాక్సిడెంట్

గోదావరిలో మునిగిన బోటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ లభించని మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. విచారణలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో గతంలో సంచలన […]

అన్నంత పని చేసిన హర్షకుమార్.. సుప్రీం ముందుకు బోటు యాక్సిడెంట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2019 | 8:32 PM

గోదావరిలో మునిగిన బోటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ లభించని మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. విచారణలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రభుత్వ వివరణతో విభేదిస్తూ.. బోటులో 93 మంది ప్రయాణించారని ఆరోపించారు. వరదను అంచనా వేస్తూ.. గోదావరిలోకి బోటు వెళ్లవద్దని దేవీపట్నం ఎస్ఐ వారించినా ఓ ఓ మంత్రి ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందన్నారు. బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ప్రమాదం జరిగిన బోటులో కూడా అలానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు సీఎం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని హర్ష కుమార్ ఆరోపించారు. దీంతో బోటులో అసలు ఎంత మంది ప్రయాణించారనే దానిపై వివాదం రాజుకుంది. అయితే బోటులో 93 మంది ఉన్నారని ఎలాంటి ఆధారాలతో చెప్తున్నారని హర్ష కుమార్‌ కు పోలీసులు నోటీసులు పంపించారు. దీనిపై సమాధానమివ్వని హర్ష కుమార్‌ తాజాగా సుప్రీం తలుపు తట్టారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..