బ్రేకింగ్: చెన్నమనేనికి బిగ్ రిలీఫ్..హైకోర్టు ఏమన్నదంటే ?
కేంద్ర హోం శాఖ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైదరాబాద్ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. రమేశ్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై హైదరాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై నాలుగు వారాలపాటు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ హోం శాఖ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని రమేశ్ […]
కేంద్ర హోం శాఖ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైదరాబాద్ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. రమేశ్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై హైదరాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై నాలుగు వారాలపాటు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ హోం శాఖ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని రమేశ్ తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన సిటిజెన్‌షిప్‌ను రద్దు చేస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులు వన్ సైడెడ్‌గా వున్నాయని, అవి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, 1955-సిటిజన్‌షిప్ యాక్ట్‌లోని సెక్షన్ 10(3) నిబంధనలను కేంద్ర హోం శాఖ అస్సలు పట్టించుకోలేదని రమేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లకపోతే పౌరసత్వాన్ని తిరస్కరించరాదని చెబుతున్న సెక్షన్ 10(3)ను కేంద్ర హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే తాను భారతీయుడినని రమేశ్ హైకోర్టుకు నివేదించారు.
అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులపై తాను ఇంప్లీడ్ అవుతానని రమేశ్ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చెబుతున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకుని, తిరిగి పొందేందుకు అవసరమైన విధివిధానాలను పూర్తి చేయకుండానే రమేశ్ పౌరసత్వం పొందాడడన్నది ఆది శ్రీనివాస్ వాదన. కనీసం ఒక సంవత్సరం పాటు భారతదేశంలో వున్న తర్వాతనే ఇక్కడి పౌరసత్వాన్ని పొందేందుకు వీలుండగా.. కేవలం 94 రోజుల పాటే రమేశ్ ఇండియాలో వున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ మధ్యంతర ఉత్తర్వులపై మరోసారి న్యాయపోరాటానికి దిగనున్నట్లు ఆది చెబుతున్నారు.