రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త

విజయవాడ: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 9 వేలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రూ. 4 వేలు జమ చేయనుంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందే అన్నదాత సుఖీభవ పథకం కింద […]

రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:35 PM

విజయవాడ: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 9 వేలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రూ. 4 వేలు జమ చేయనుంది.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు తొలి విడతగా రూ.4 వేలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పెథాయ్‌ తుపాను బాధితులను కేంద్రం ఆదుకోకపోయినా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతు కుటుంబానికి తాను అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారు.