AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు తెలుగు రాష్ట్రాల్లో డేటా వార్.. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు

డేటా చోరీ అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు పోలీసులు. అశోక్ దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగుళూరుకి చెందిన ఎథికల్ హ్యకర్ల ద్వారా ఐటీ గ్రిడ్ కంప్యూటర్స్‌లో ప్రాసెస్డ్ డేటాను సేకరిస్తున్నారు పోలీసులు. ఇక డేటా చోరీ అంశంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల […]

రెండు తెలుగు రాష్ట్రాల్లో డేటా వార్.. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:07 PM

Share

డేటా చోరీ అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు పోలీసులు. అశోక్ దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగుళూరుకి చెందిన ఎథికల్ హ్యకర్ల ద్వారా ఐటీ గ్రిడ్ కంప్యూటర్స్‌లో ప్రాసెస్డ్ డేటాను సేకరిస్తున్నారు పోలీసులు.

ఇక డేటా చోరీ అంశంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆధార్ డేటాను దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే.. అంలాంటిదేమీ లేదు, దమ్ముంటే నిరూపించాలని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. తమ పార్టీ కార్యకర్తల డేటాను దొంగిలించి వైసీపీకి లబ్ధి చేకూరేలా టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం కొనసాగుతోంది.

సేవామిత్ర లాంటి యాప్స్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఓటర్ల లిస్టును సేకరించి వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని.. లోకేష్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేవామిత్ర యాప్ ద్వారా తమ పార్టీకి అనుకూలమైన వారెవరు..? వ్యతిరేకులెవరని..? తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు లోకేశ్వర్ రెడ్డి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఐటీ గ్రిడ్ అనే సంస్థపై దాడులు చేశారు. పలు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

నేతల వార్ :

డేటా చోరీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హద్దులు దాటి వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏ పార్టీకి లేని టెక్నాలజీ టీడీపీ సొంతమన్న చంద్రబాబు.. తమ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు సీఎం.

ఇక టీడీపీ నేతలకు, సీఎంకు గట్టి కౌంటరే ఇస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వాలు దగ్గరుండే ప్రజల డేటా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం నేరం కాదా.. అని ప్రశ్నించారు వైసీపీ నేత జగన్. దొంగ ఓట్లను తొలగించమంటే అదేదో నేరంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు జగన్.

టీఆర్ఎస్‌పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఏపీ ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచిందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు విచారణ జరుగుతుంటే ఏ నేరం చేయని చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటని ప్రశ్నించారు కేటీఆర్.

పోలీసుల వార్ :

మరోవైపు డేటా చోరీ అంశంపై ఏపీ, తెలంగాణ పోలీసులు కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. ముందు ఏపీ పోలీసులపై మండిపడ్డారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దీనికి కౌంటర్‌గా ఏపీ డీజీపీ వ్యాఖ్యానించారు. విచారణలో భాగంగా పోలీసులు ఎక్కడికైనా వెళ్లవచ్చని.. ఎవరినైనా విచారణ చేయవచ్చని అన్నారు. ఫారమ్-7 దరఖాస్తు ద్వారా ఓట్ల తొలగింపు అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. ఇప్పటివరకూ ఓట్ల తొలగింపు కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు డీజీపీ.

ఏపీ ఎలక్షన్ కమిషన్ :

ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిస్తున్నారంటూ వచ్చే రూమర్లను నమ్మవద్దని ఏపీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటివరకు 74 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కేవలం 10 వేల డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను మాత్రమే తొలగించడం జరిగిందన్నారు. దొంగ ఓట్లంటూ 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి 200మందిపై కేసులు పెట్టామని తెలిపారాయన.