Corona effect కేసుల్లో అమెరికా.. మరణాల్లో ఇటలీ… వణికిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఇళ్ళలోనే బిక్కుబిక్కుమంటూ బతికేలా చేస్తోంది. వైరస్ మొదలైంది చైనాలోనే అయినా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తితో భీతిల్లిపోతోంది.

Corona effect కేసుల్లో అమెరికా.. మరణాల్లో ఇటలీ... వణికిస్తున్న కరోనా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2020 | 2:55 PM

Corona effect on the globe worst: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఇళ్ళలోనే బిక్కుబిక్కుమంటూ బతికేలా చేస్తోంది. వైరస్ మొదలైంది చైనాలోనే అయినా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తితో భీతిల్లిపోతోంది. అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కారణంగా పిట్టల్లా రాలుతున్న జనానికి కనీసం ఖననం చేసేందుకు జాగా లేక ట్రక్కుల్లో శవాలను తరలించాల్సిన దుస్థితి అమెరికాలో కనిపిస్తోంది.

తొలుత చైనాలో కనిపించిన కరోనా వైరస్… ఇపుడు అమెరికాలో విజ‌ృంభిస్తోంది. అమెరికాలో బుధవారం మధ్యాహ్నానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు కలిగిన దేశంగా అగ్రరాజ్యం కొనసాగుతోంది. అమెరికా తర్వాత రెండో స్థానంలో లక్షా 41 వేల పాజిటివ్ కేసులతో స్పెయిన్ రెండో స్థానంలోను, లక్షా 35 వేల పాజిటివ్ కరోనా కేసులో మూడో స్థానంలో ఇటలీ కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఇరాన్, యూకే, టర్కీ దేశాలు అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

అదే సమయంలో మరణాలలో ఇటలీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 17 వేల 127 మంది ఇప్పటి వరకు ఇటలీలో కరోనా బారిన పడి మృత్యుముఖంలోకి చేరుకున్నారు. 14 వేలకు పైచిలుకు మరణాలతో స్పెయిన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత మూడో స్థానంలో అమెరికాలో మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో 12 వేలకు పైగా మరణాలు నమోదవుతుండగా.. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలు కరోనా విలయ తాండవంతో విలవిలలాడుతున్నాయి.