Lock-down కరోనా కట్టడికి యోగి సంచలన నిర్ణయం.. 15 జిల్లాలు బంద్

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పదిహేను జిల్లాల్లో పూర్తిగా మూసి వేస్తున్నట్లుగా యుపి ప్రభుత్వం ప్రకటించింది.

Lock-down కరోనా కట్టడికి యోగి సంచలన నిర్ణయం.. 15 జిల్లాలు బంద్
Follow us

|

Updated on: Apr 08, 2020 | 3:26 PM

UP CM Yogi Adityanath has taken sensational decision: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పదిహేను జిల్లాల్లో పూర్తిగా మూసి వేస్తున్నట్లుగా యుపి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో యుపి రాజధాని లక్నోతోపాటు కాన్పూర్, వారణాసి, ఆగ్రా వంటి కీలకమైన జిల్లాలున్నాయి. బుధవారం అర్దరాత్రి నుంచి ఈ 15 జిల్లాల్లో సర్వం బంద్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా చర్యలు మొదలయ్యాయి.

ఈ పదిహేను జిల్లాల్లో లక్నో, ఆగ్రా, ఘాజియాబాద్, గౌతమ్‌బుద్ద్ నగర్, కాన్పూర్, వారణాసి, షామ్లీ, మీరట్, బరేలీ, బులంద్ షహర్, ఫిరోజాబాద్, మహారాజ్ గంజ్, సీతాపూర్, సైహారాన్ పూర్, బస్తీ వున్నాయి. ఈ జిల్లాల్లో హోం డెలివరీ, మెడికల్ టీమ్స్ మినహా ఇంకేది అనుమతించమని యోగీ సర్కార్ ప్రకటించింది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.కే.తివారీ తెలిపారు. సీల్ చేసిన జిల్లాల జాబితాలో ఢిల్లీకి ఆనుకున్న నోయిడా, ఘజియాబాద్ సహా మీరట్, లక్నో, ఆగ్రా తదితర జిల్లాలున్నాయని వివరించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నామని తివారీ తెలిపారు.