AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారం కోసమే పార్టీ మారా: ఆమంచి

విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొద్ది రోజుల క్రితమే టీడీపీని వీడి వైసీపీ కండువ కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా పలువురు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును అధికారం కోసమే పార్టీ మారాను. అధికారంలో ఉండి ప్రజా సేవ చేయాలనేది తన అభిమతమని అన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏపీ […]

అధికారం కోసమే పార్టీ మారా: ఆమంచి
Vijay K
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 9:35 PM

Share

విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొద్ది రోజుల క్రితమే టీడీపీని వీడి వైసీపీ కండువ కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా పలువురు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమంచి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును అధికారం కోసమే పార్టీ మారాను. అధికారంలో ఉండి ప్రజా సేవ చేయాలనేది తన అభిమతమని అన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కాదా అని ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్న చంద్రబాబు తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. మరి ఏపీలో చీరాల నియోజకవర్గం ఒక భాగం కాదా అని ప్రశ్నించారు. 2 వేల మందికి పైగా అనుచరులతో చర్చించిన పిదపనే నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఆమంచి వెల్లడించారు.

Follow Us