ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు… ఫలితం తేలేందుకు రెండు రోజుల సమయం.. లెక్కింపు ప్రక్రియ ఇలా..!
అసెంబ్లీ ఎన్నికలను తపించిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
Graduate MLC Election Counting : అసెంబ్లీ ఎన్నికలను తపించిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎల్.బి.నగర్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు జరిపేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యాయి. ఓట్లన్నీ ఇక్కడే లెక్కించనుండటం వలన, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పెట్టె అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో షిఫ్తుల వారీగా పనిచేసేందుకు అధికారులకు, సిబ్బందిని నియమించింది ఎస్ఈసీ.
ఈనెల 17న ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున 19వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందికి కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా సమావేశం నిర్వహించి లెక్కింపు ప్రక్రియ పై వివరించారు.
లెక్కింపు ప్రక్రియ ఇలా…
✔ మొత్తం ఎనిమిది చాంబర్లు ఏడు టేబుళ్ల చొప్పున మోత్తం 56 టేబుళ్ల ఏర్పాటు. ✔ ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లకు పోటీచేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు. ✔ ఉదయం 6:30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాల్ కు చేరుకోవాలి. ✔ బ్యాలెట్ బాక్సులను ముందుగా ఏజెంట్లచే పరిశీలన చేసి వారి సంతకం తీసుకున్న మీదటే తెరుస్తారు. ✔ కౌంటింగ్ హాల్ లోకి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు సెల్‌ఫోన్లు గానే, పెన్ను, పుస్తకాలను తేవడాన్ని అనుమతించరు. ✔ ఏజెంట్లకు ఎన్నికల అధికారులే పెన్సిల్, నోట్‌బుక్‌లను అందిస్తారు. ✔ లెక్కింపునకు మొత్తం 8 హాళ్లను వినియోగిస్తున్నారు. ✔ ఒక్కో హాళ్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు. ✔ 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్ల లెక్కింపు. ✔ ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్ పత్రాలను ఉంచిన అనంతరం 25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కడతారు. ✔ ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం 25 చొప్పున బ్యాలెట్ పత్రాలను ఒక కట్ట కట్టడానికె అధిక సమయం పట్టేఅవకాశం. ✔ ఉ.8గం.లకు లెక్కింపు ప్రారంభమైతే రాత్రి 8గం.వరకు కేవలం బ్యాలెట్ పత్రాలను కట్ట కట్టే ప్రక్రియ ✔ కట్ట కట్టిన బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్‌ల సమక్షంలో వేరు చేస్తారు. ✔ మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ✔ ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ. ✔ టేబుళ్ల ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలు. ✔ రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే తొలి సమాచారం తెలిసే అవకాశం. ✔ టేబుల్‌కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. ✔ 3,57,354 ఓట్లను లెక్కించడానికి దాదాపు పది గంటల సమయం. ✔ రెండో రోజు ఉదయానికి కానీ ఎవరు గెలుపునకు దగ్గర్లో ఉన్నారనేది తేలనుంది.