జైహింద్‌ అనాల్సిందే: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశాలు

న్యూడిల్లీ: విమానాల్లో కాబిన్‌ సిబ్బంది ఇచ్చే సందేశం అనంతరం వినమ్రతతో ‘జై హింద్‌’ నినాదాన్ని ప్రయాణికులకు తప్పనిసరిగా వినిపించాలని ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని కోరారు. 2016 మే లో ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వినీ లోహానీ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేశారు. విమాన పైలెట్లు ప్రయాణికులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండాలని, మొదటిసారిగా మాట్లాడినప్పడు ‘జైహింద్‌’ అంటూ […]

జైహింద్‌ అనాల్సిందే: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశాలు
Follow us

|

Updated on: Mar 05, 2019 | 7:00 PM

న్యూడిల్లీ: విమానాల్లో కాబిన్‌ సిబ్బంది ఇచ్చే సందేశం అనంతరం వినమ్రతతో ‘జై హింద్‌’ నినాదాన్ని ప్రయాణికులకు తప్పనిసరిగా వినిపించాలని ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని కోరారు. 2016 మే లో ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వినీ లోహానీ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేశారు. విమాన పైలెట్లు ప్రయాణికులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండాలని, మొదటిసారిగా మాట్లాడినప్పడు ‘జైహింద్‌’ అంటూ నినదించాలని కోరారు. ఈ నినాదం ప్రయాణికులను ఎంతో ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద 100 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని గత సంవత్సరం అక్టోబర్‌ 22న రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 2018 చివరి నాటికి 75 రైల్వేస్టేషన్ల వద్ద అయినా జెండా ఎగరాలని వివిధ రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రైల్వేస్టేషన్ల ముంగిట మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అడుగులు ముందుకు వేయడం హర్షణీయం.