AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ, తెలంగాణకు కొత్త కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలు

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలను అపాయింట్ చేసింది.

ఏపీ, తెలంగాణకు కొత్త కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలు
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2020 | 11:01 PM

Share

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలను అపాయింట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఊమెన్‌చాందీ నియమితులయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ప్రస్తుత ఇన్‌చార్జి కుంతియాను తొలగించిన అధిష్ఠానం..ఆ బాధ్యతలను మాణికం ఠాగూర్‌ కు అప్పగించింది.

 సీడబ్ల్యూసీ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పార్టీ వ్యవహారాల నిర్వహణలో భాగంగా అధ్యక్షురాలికి సహాయ  కమిటీని ఏర్పాటైంది. ఈ కమిటీలో అహ్మద్‌ పటేల్, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ , వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్ తదితరులు ఉన్నారు. కాగా పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి గులాబ్‌ నబీ ఆజాద్‌ను తొలగించారు.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

డ్రగ్స్ కేసు : ఆస్పత్రిలో సంజనా సిత్రాలు !