బ్రేకింగ్: పంజాబ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 23 మంది సజీవ దహనం

పంజాబ్‌లో దారుణం జరిగింది. గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభించడంతో 23 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాణాసంచా ఫ్యాక్టరీ భవనం ఈ పేలుడు ధాటికి పూర్తిగా దెబ్బతింది. ఈ దుర్ఘటన తర్వాత అక్కడ పనిచేస్తున్న మరికొంతమంది పనివాళ్లు కనిపించకుండా పోయారు. వీరంతా భవనం శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ భారీ పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని […]

బ్రేకింగ్: పంజాబ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 23 మంది సజీవ దహనం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 04, 2019 | 10:04 PM

పంజాబ్‌లో దారుణం జరిగింది. గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభించడంతో 23 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాణాసంచా ఫ్యాక్టరీ భవనం ఈ పేలుడు ధాటికి పూర్తిగా దెబ్బతింది. ఈ దుర్ఘటన తర్వాత అక్కడ పనిచేస్తున్న మరికొంతమంది పనివాళ్లు కనిపించకుండా పోయారు. వీరంతా భవనం శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ భారీ పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగసిపడుతున్న మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు ఎగసి పడుతున్నాయి.

గురుదాస్‌పూర్ బటాలాలోని నివాస ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. ఈ ఫ్యాకర్టీలోనే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ అగ్నిప్రమదం సంభవించింది. భారీ ఎత్తున జరిగిన పేలుడు ధాటికి ఏకంగా బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రక్షణ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మంటలు ఆర్పుతూ శిధిలాలు తొలగిస్తున్నారు.