బొగత అందాలు చూడతరమా..! ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న..

Bogatha Waterfalls at Mulugu District in Telangana, బొగత అందాలు చూడతరమా..! ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న..

చూట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. మేనిని తాకే నీటి తుంపరలు.. పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం కనువిందు చేస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసు దోచుకుంటుంది. గత రెండు రోజులుగా కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో జలపాతం జాలువారుతుంది.

Bogatha Waterfalls at Mulugu District in Telangana, బొగత అందాలు చూడతరమా..! ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న..

బొగత జలపాతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. జలపాతం ఎంతో కనువిందు చేస్తుంది. జలపాతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూడటానికి పర్యాటకులు లైన్ కడుతున్నారు. ములుగు జిల్లా వాడేడు మండలం సీకుపల్లి అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తూ ప్రకృతి మాత ఒడిలో సేదతీరుతూ.. తేలియాడుతున్నారు.

Bogatha Waterfalls at Mulugu District in Telangana, బొగత అందాలు చూడతరమా..! ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *