Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హబ్సిగూడలో దారుణం.. పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ హబ్సిగూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని చంపి, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులిద్దరూ చెరో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad: హబ్సిగూడలో దారుణం.. పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 11, 2025 | 7:11 AM

హైదరాబాద్‌ హబ్సిగూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని చంపి, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులిద్దరూ చెరో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామానికి చంద్రశేఖర్‌ రెడ్డి, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు.. వీరంతా హబ్సిగూడలో నివాసముంటున్నారు.. చంద్రశేఖర్‌ రెడ్డి ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌గా పనిచేశారు.. అయితే.. ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలోనే.. కూతురు శ్రిత, కుమారుడు విశ్వాన్‌ రెడ్డిని చంపి.. భార్య కవితతో కలిసి సూసైడ్‌ చేసుకున్నారు చంద్రశేఖర్‌ రెడ్డి.. కూతురు శ్రితా రెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వాన్ రెడ్డి ఐదవ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముందు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. వారు అపస్మారక స్థితిలో ఉండగా.. గొంతునులిమి చంపి.. తర్వాత ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆర్థిక ఇబ్బందులే కారణమని రాశారు చంద్రశేఖర్‌. గత నెల 21నే వీరు చనిపోవాలని ఓసారి ప్రయత్నించారు. కానీ.. ఆరోజు తమ ఆలోచనను విరమించుకున్నా.. నిన్న దాన్ని అమలు చేశారు. ముందు పిల్లల్ని చంపి.. మంచంపై పడుకోబెట్టారు. ఆతర్వాత దంపతులు ఇద్దరూ చెరో గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నారు.

వీరి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామమని.. లెక్చరర్‌ వృతి నిమిత్తం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ వచ్చి హబ్సిగూడలో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. వీరి కుమార్తె శ్రీతారెడ్డి అబిడ్స్ లోని ఫిట్జ్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. ఆమె క్లాస్ లో టాపర్‌గా తోటి విద్యార్థులు చెబుతున్నారు. కుమారుడు విశ్వాన్‌ రెడ్డి కూడా బాగా చదువుతాడని అంటున్నారు. అతడు జాన్సన్ స్కూల్ లో 5th క్లాస్ చదువుతున్నాడు.

విషాద వార్తను తెలుసుకున్న చంద్రశేఖర్‌ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు… పరుగు పరుగున హబ్సిగూడకు చేరుకున్నారు. చనిపోయిన నలుగురిని చూసి తట్టుకోలేక గుండెలవిసేలా రోదించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాశారని ఏసీపీ రాజేందర్‌ తెలిపారు. ఇంట్లో రెండు లేఖలు దొరికాయని వివరించారు.. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..