బోనాల్లో గమ్మత్తు.. మద్యం మత్తులో పోలీస్‌కు ముద్దు!
ఆషాడ మాసం బోనాల జాతర చివరి అంకంలో గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది. అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు సందర్భంగా యువకులు రోడ్డుపై ఫుల్ జోష్‌లో డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఆ క్రమంలో విధులు నిర్వహిస్తూ అటువైపుగా వచ్చిన ఎస్ఐ మహేందర్‌ను ఓ యువకుడు హఠాత్తుగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడు. బోనాలు.. అదీ కూడా పండగ వాతావరణం కాబట్టి మందు మత్తులో చిందేయడం కామన్. కానీ ఆ సదరు యువకుడు చేసిన చిలిపి పనికి ఎస్ఐ […]
ఆషాడ మాసం బోనాల జాతర చివరి అంకంలో గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది. అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు సందర్భంగా యువకులు రోడ్డుపై ఫుల్ జోష్‌లో డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఆ క్రమంలో విధులు నిర్వహిస్తూ అటువైపుగా వచ్చిన ఎస్ఐ మహేందర్‌ను ఓ యువకుడు హఠాత్తుగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడు.
బోనాలు.. అదీ కూడా పండగ వాతావరణం కాబట్టి మందు మత్తులో చిందేయడం కామన్. కానీ ఆ సదరు యువకుడు చేసిన చిలిపి పనికి ఎస్ఐ తీవ్ర ఆగ్రహానికి గురై చెంప చెళ్లుమనిపించాడు. అయినా కూడా ఆ యువకుడు బెదరకుండా.. నెమ్మదిగా స్టెప్పులు వేస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నవ్వు తెప్పిస్తూ ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.