Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Turmeric Costly Haldi: నల్ల పసుపు కొమ్ముల విశిష్టత ఏమిటో తెలుసా?.. వీటిని ఎప్పుడైనా చూశారా?..

సర్వసాధారణంగా అందరూ చూసే పసుపు కొమ్ములు పసుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇవి నీలం, నలుపు రంగులో కూడా లభిస్థాయి. ఈ విషయం ఈ జనరేషన్ లో అతి తక్కువ మందికి...

Black Turmeric Costly Haldi: నల్ల పసుపు కొమ్ముల విశిష్టత ఏమిటో తెలుసా?.. వీటిని ఎప్పుడైనా చూశారా?..
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2021 | 4:23 PM

Black Turmeric Costly Haldi: భారతీయులు పసుపు వేయకుండా కూరను వండరు. దాదాపు పసుపు లేని ఇల్లు ఉండదు.. పసుపు వంటకాల్లోనే కాదు. .సౌదర్య సాధనంగా, ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే సర్వసాధారణంగా అందరూ చూసే పసుపు కొమ్ములు పసుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇవి నీలం, నలుపు రంగులో కూడా లభిస్థాయి. ఈ విషయం ఈ జనరేషన్ లో అతి తక్కువ మందికి తెలుసు. ఐతే తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ శ్వేత బొడ్డు ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోలతో మళ్ళీ తెరపైకి వచ్చాయి. నిజానికి ఇవి పేరుకి ఇవి బ్లాక్ పసుపుకొమ్ములు అయినప్పటికీ… ఇవి చూడటానికి బ్లూ కలర్‌లో కనిపిస్తాయి. వీటి ధర కూడా ఎక్కువే.. వీటిని ఎక్కువగా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వాడతారని చెప్పారు.

అయితే ఈ నల్ల పసుపు ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలలో ఉందని తెలుస్తోంది. జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగ ఉపయోగ పడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుందని భారతదేశంలో చాలా మంది నమ్ముతారు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుందని తెలుస్తోంది. ఈ మొక్కలు అంత ఈజీగా పెరగవు. వీటిని సాగు చేయడం చాలా కష్టమని తెలుస్తోంది.

నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిషా, నిషి, రజిని, రాత్రి మొక్క నల్ల పసుపేనని భావిస్తారు.దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది., పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. కాలీ అంటే నలుపు ఆని అర్ధం. అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును “Black Turmeric” అని అంటారు.

శరీరంలో వేడి చేసినప్పుడు, జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు, వాంతులు, పొట్టలో గడబిడలు, దగ్గు వంటివి ఉన్నప్పడు ఈ నలుపు పసుపు కొమ్ములను వాడతారు. మహిళలకు పీరియడ్స్ సక్రమంగా జరిగేందుకు ఈ నల్ల పసుపు మేలు చేస్తుంది.  మూత్ర సంబంధ వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుందట. దగ్గు, ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు రాత్రి వేళ పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తింటా రు.

Also Read: బాబాయ్ అబ్బాయ్‌లతో మెగా మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్న శంకర్..?