AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పదేపదే బయట జ్యూస్ తాగుతున్నారా.? మీ కథ కైలసానికే..

హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో పలు జ్యూస్ సెంటర్ల పరిస్థితులు బట్ట బయలు అయ్యాయి. ఆమీర్‌పేట్ వేంగల్రావ్ నగర్ ప్రాంతాలలో జ్యూస్ సెంటర్ పై అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం తాగే పండ్ల రసాల వెనుక భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: పదేపదే బయట జ్యూస్ తాగుతున్నారా.? మీ కథ కైలసానికే..
Representative Image.3jpg
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 18, 2025 | 7:51 PM

Share

హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో పలు జ్యూస్ సెంటర్ల పరిస్థితులు బట్ట బయలు అయ్యాయి. ఆమీర్‌పేట్ వేంగల్రావ్ నగర్ ప్రాంతాలలో జ్యూస్ సెంటర్ పై అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం తాగే పండ్ల రసాల వెనుక భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో అధికారులు సందర్శించిన జ్యూస్ సెంటర్లలో బాంబే జ్యూస్, న్యాచురల్ ఫ్లేవర్స్, KGN జ్యూస్ సెంటర్, కోకనట్ జ్యూస్ బార్, A1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్ ఉన్నాయి. ప్రతి జ్యూస్ సెంటర్ వద్ద నీట్‌నెస్ లేని పరిస్థితులు కనిపించడంతో ప్రజల ఆరోగ్యంపై పెనుప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది.

ప్రధానంగా అధికారులు తనిఖీలో . కొన్ని సెంటర్లలో పూర్తిగా పాడైపోయిన పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచబడ్డాయి. ప్రత్యేకించి బాంబే జ్యూస్ కేంద్రంలో ఈ విషయాలు అధికంగా కనిపించాయి. గ్లవ్స్ లేకుండా,ఆప్రాన్‌లు లేకుండా పనిచేసే స్టాఫ్, ఉన్నారు. న్యాచురల్ ఫ్లేవర్స్ అనే జ్యూస్ సెంటర్లో అయితే బొద్దింకలు రిఫ్రిజిరేటర్లలో కనిపించాయి. అదే విధంగా పాత ఫ్రూట్ సిరప్స్, expiry తేదీలు లేని సోడా బాటిళ్లు కూడా అక్కడ నిల్వలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇంకా, KGN జ్యూస్ సెంటర్‌లో అస్వచ్ఛతతో నిండిన ఫ్రూట్ సలాడ్ కనిపించింది. ఇది పూర్తిగా స్పోయిల్ అయినదని పేర్కొనడమే కాక, శుభ్రతా ప్రమాణాలు ఎంతలా ఉల్లంఘించబడ్డాయో తెలియజేసింది. కోకనట్ జ్యూస్ బార్‌లోనూ పాడైన పండ్లు కనిపించాయి. A1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్ విషయానికొస్తే, అక్కడ డ్రెయినేజ్ సరిగా లేకపోవడం, శుభ్రత జిరాయింపు స్థాయిలో ఉండటం, కిచెన్ పరిసరాలు బానిస స్థాయిలో ఉండటం వంటి విషయాలు బయటపడ్డాయి. వాడుతున్న కత్తులు, ఇనుము పరికరాలపై జంగు పట్టి ఉండటం, వీటిని శుభ్రపరచకపోవడం, పర్యావరణం అపరిశుభ్రమై ఉండటం అన్నీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించగల అంశాలుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో, చాలా సెంటర్లకు అవసరమైన FSSAI లైసెన్సులు లేకపోవడం అధికారులు ఉల్లంఘనగా పరిగణించారు. Food Safety and Standards Act, 2006 ప్రకారం ఇది నేరంగా పరిగణించబడుతుంది. అధికారుల ప్రకారం, “నోటీసు ఇచ్చిన తరువాత కూడా ఈ విధంగానే కొనసాగితే అలాంటి కేంద్రాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మూసివేయబడతాయి” అని వారు హెచ్చరించారు.

ఈ తనిఖీల పర్యవసానంగా, ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. చెడిపోయిన ఆహారం, కలుషిత పరికరాలు కలిగి ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ..దీని ద్వారా టైఫాయిడ్, కలరా, కడుపు వ్యాధులు. దీనివల్ల ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రోడ్డుపై తరచూ రసాలు తాగే స్థానిక ప్రజలు ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదంలో ఉన్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తాము తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యూస్ తాగే ముందు ఆ కేంద్రం దగ్గర FSSAI లైసెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. కేంద్రం బయట నుంచి కనీసం పరిశుభ్రంగా ఉందా అనేది గమనించాలి. ఉపయోగించే ప్లాస్టిక్ లేదా గ్లాస్ బాటిళ్ల మీద తయారీ తేదీ, గడువు తేదీ (expiry date) ఉన్నాయో లేదో చూసుకోవాలి.