- Telugu News Photo Gallery Cinema photos Krithi shetty and sreeleela trending in social media with their photoshoots
అక్కడ స్ట్రగుల్ అవుతున్న.. ఇక్కడ మాత్రం దుమ్ములేపుతున్న ముద్దుగుమ్మలు
ఇద్దరూ యంగ్ హీరోయిన్లే.. 20 ఏళ్ళకే ఈ ఇద్దరికి మంచి ఇమేజ్ వచ్చింది.. కెరీర్ మొదట్లో వరస విజయాలు అందుకున్నారు. ఇప్పుడిద్దరూ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.. సర్వైవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ షో చేస్తూనే ఉంటారు. మరి ఎవరా ఇద్దరు బ్యూటీస్..?
Updated on: Apr 18, 2025 | 7:04 PM

ఇద్దరూ యంగ్ హీరోయిన్లే.. 20 ఏళ్ళకే ఈ ఇద్దరికి మంచి ఇమేజ్ వచ్చింది.. కెరీర్ మొదట్లో వరస విజయాలు అందుకున్నారు. ఇప్పుడిద్దరూ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.. సర్వైవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ షో చేస్తూనే ఉంటారు. మరి ఎవరా ఇద్దరు బ్యూటీస్..?

శ్రీలీల, కృతి శెట్టి.. మన ఆడియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేర్లు. 20 ఏళ్ళు కూడా నిండకుండానే ఇండస్ట్రీకి వచ్చి.. తక్కువ టైమ్‌లోనే స్టార్స్ అయిపోయారు ఇద్దరు బ్యూటీస్. కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు.

శ్రీలీల కాస్త బెటర్ గానీ.. కృతి శెట్టి కెరీర్‌కు తెలుగులో ఫుల్ స్టాప్ పడ్డట్లే కనిపిస్తుంది. సినిమాలు చేసినా చేయకపోయినా.. అవకాశాలు వచ్చినా రాకపోయినా.. గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు శ్రీలీల, కృతి శెట్టి.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఇటు శ్రీలీల.. అటు కృతి ఇద్దరూ తమ గ్లామర్‌తో హీట్ పుట్టిస్తున్నారు.

శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతరతో పాటు లెనిన్, కార్తిక్ ఆర్యన్ సినిమాలతో బిజీగా ఉంటే.. కృతి శెట్టి తమిళంపై ఫోకస్ చేసారు. ఈమెకు తెలుగులో అవకాశాలే లేవు. అందుకే గ్లామర్ షోలో మరింత డోస్ పెంచేస్తున్నారు బేబమ్మ. ఈ ఇద్దరు హీరోయిన్ల ఫోటోషూట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.