AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షో తరువాత చాలా కోల్పోయాం.. ‘బిగ్‌బాస్’‌పై మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పెట్టిన బిగ్‌బాస్‌పై వివాదాలు రావడం తొలిసారేం కాదు. అన్ని భాషల్లోనూ ఈ షో పలు వివాదాల్లో నిలిచింది.

షో తరువాత చాలా కోల్పోయాం.. 'బిగ్‌బాస్'‌పై మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 20, 2020 | 12:22 PM

Share

Bigg Boss show contestants: ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పెట్టిన బిగ్‌బాస్‌పై వివాదాలు రావడం తొలిసారేం కాదు. అన్ని భాషల్లోనూ ఈ షో పలు వివాదాల్లో నిలిచింది. ఈ షో వలన డబ్బు, పేరు రావడం మాట అటుంచితే, షో నుంచి బయటకు వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చాలా మంది చెబుతున్నారు. ఇక తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఈ షో నాలుగో సీజన్ జరుగుతుండగా.. మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ షోను చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని, కొందరు చేసే కామెంట్లు, ట్రోల్స్‌, మీమ్స్ చాలా దారుణంగా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్‌‌తో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చి 13 వారాలు పాటు హౌజ్‌లో కొనసాగిన వితికా శెరు ఆ షోకి వెళ్లడం వల్ల తాను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానో తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అలీ రీ ఎంట్రీ తరువాత ఫిజికల్ టాస్క్‌ల గురించి తాను చేసిన కామెంట్స్‌ని బిగ్ బాస్ ఎలా ప్రొజక్ట్ చేశారన్న దాన్ని కళ్లకు కట్టింది వితికా. అంతేకాదు బిగ్ బాస్ అనేది 24 గంటల షో అని, కాని మనకి చూపించేది ఒక గంట అని, ఆ గంట షో చూసి ఒక మనిషిని ఎంతలా దిగజార్చుతారంటే.. ఆ తరువాత వాళ్లకు లైఫ్ ఉంటుందా? అనిపించింది అని అన్నారు. ఇక ఈ షోకి ఒక డైరెక్టర్ ఉంటారని, రోజుకి 500 మంది పని చేస్తుంటారని తెలిపారు. ఇక బయటికి వచ్చిన తరువాత చాలా మంది స్నేహితులు తనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేక్షకులకు చూపించేది అంతా నిజం కాదని సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి అన్నారు. అక్కడ జరిగేది వేరు, చూపిస్తున్నది వేరని తెలిపారు. ఈ షో వలన తమ ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని సంచలన విషయాలు బయటపెట్టారు. ఇక గీతా మాధురి సైతం బిగ్‌బాస్ సెట్‌లో జరిగేది పావలా అయితే చూపించేది రూపాయి అంటు కామెంట్ పెట్టారు. అయితే కొందరేమో వీరి కామెంట్లతో ఏకీభవిస్తుండగా.. మరికొందరేమో ఇదంతా ప్రమోషన్ల కోసమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

ఐదేళ్ల వయసులోనే కిమ్‌ పడవ నడిపేవాడట

2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారుతుంది

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..