AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ దొంగా, హారిక !

విమర్శలు, ప్రశంసలు ఎలా ఉన్నా  బిగ్ బాస్ సీజ‌న్ 4 ముందుకు వెళ్లిపోతుంది. ఎలిమినేషన్ ప్రకియపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

అమ్మ దొంగా, హారిక !
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2020 | 2:51 PM

Share

విమర్శలు, ప్రశంసలు ఎలా ఉన్నా  బిగ్ బాస్ సీజ‌న్ 4 ముందుకు వెళ్లిపోతుంది. ఎలిమినేషన్ ప్రకియపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.  బుధ‌వారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు ‘ప‌ల్లెకు పోదాం ఛ‌లో’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సోహైల్ ఇంటి పెద్ద‌గా వ్యవహరించగా, ఆయ‌న వైఫ్‌గా లాస్య, కుమార్తెగా అరియానా న‌టించారు. ఇక అమ్మ‌ రాజ‌శేఖ‌ర్ ఊరి పెద్ద‌కు సర్వెంట్‌గా ఉంటూనే ఆయ‌న భార్యను ట్రాప్ చేసే పాత్ర ఇచ్చారు . అలానే పాన్ షాజ‌మాని అయిన అవినాష్ ఊరి పెద్ద కుమార్తె అయిన అరియానాపై మనసు పడతాడు. అఖిల్ ఊరిపెద్ద బావ‌మరిది. బాగా జ‌ల్సా చేసే మనిషి. ఇక అభిజిత్‌, మోనాల్‌లు వంట మనుషులు. ఎవ‌రైతే వ‌డ్లు దంచి బియ్యంగా చేసి ఇస్తారో వారికి ఆహారం ఇస్తారు. హారిక‌.. గ్రామంలో రూమర్స్ సృష్టించే అమ్మాయిగా ఉంటూ అంద‌రికి సాయ‌ప‌డాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అంతేకాక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా  ఇంట్లో ముగ్గురిని హ‌త్య చేయాల్సి ఉంటుంది.  అవినాష్‌కి కోపం తెప్పించ‌డం, అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై కాఫీ పోయ‌డం, ఎవ‌రినైతే హత్య చేయలానుకుంటుందో వారి పేరు ఇంట్లోని విండోపై రాయ‌డం . ఈ మూడు కంప్లీట్ చేసినట్టైతే మూడు హత్యలు చేసినట్టని హారికకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

టాస్క్ కోసం ప‌ల్లెటూరి వాళ్లలా మారిన ఇంటి స‌భ్యులు ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఒక వైపు తమ మధ్య విభేదాలను కొనసాగిస్తూనే,  టాస్కులో సందడి చేశారు. అరియానా వెనుక ప‌డుతున్న కార‌ణంగా అవినాష్‌పై ఊరి పెద్ద అయిన సోహైల్  సీరియస్ అయ్యాడు. దీంతో అవినాష్ కాళ్లపై పడటంతో ఊరి పెద్ద క్షమించాడు ఈ సారికి ఒదిలేశాడు‌. ఇంకోసారి ఇలా జ‌రిగితే ఊరి బ‌హిష్క‌ర‌ణ చేస్తాన‌ని చెప్పాడు. మ‌రో వైపు పాన్ షాప్ య‌జ‌మాని త‌మ్ముడు మెహ‌బూబ్ రౌడీ కాగా, అత‌ను హారిక‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు.

ఇక హారిక‌ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేసింది. అమ్మ‌రాజ‌శేఖ‌ర్ పై కాఫీ ఒల‌క‌బోసింది. అనుకోకుండా ప‌డిందని, సారీ చెప్పడంతో ఆయ‌న ఓకే అన్నాడు. ఇక ఎవ‌రికి పెద్ద‌గా డౌట్ రాలేదు.  కొద్ది సేప‌టి త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో హ‌త్య జ‌రిగింద‌ని చెప్ప‌డంతో అంతా కంగుతిన్నారు. ఆ తర్వాత టాస్క్ అంతా సో..సోగా సాగింది.  కాగా ఈ టాస్క్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వారు కెప్టెన్ పోటీ దారులు అవుతార‌ని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక హారిక అవినాష్‌కు కోపం  తెప్పించినట్టు తాజా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరుగుతుందో చూడాలి.

Follow Us