AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదీ నుంచి అదే జోరు.. ఇంకెన్ని రికార్డులు బిగ్‌బాస్‌-4 సొంతమవుతాయో..?

కరోనా లాక్ డౌన్ అనంతరం మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు దీన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మాకు మంచి రేటింగ్ ను సంపాదించి పెట్టింది.

ఆదీ నుంచి అదే జోరు.. ఇంకెన్ని రికార్డులు బిగ్‌బాస్‌-4 సొంతమవుతాయో..?
Balaraju Goud
|

Updated on: Sep 18, 2020 | 3:00 PM

Share

కరోనా లాక్ డౌన్ అనంతరం మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు దీన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మాకు మంచి రేటింగ్ ను సంపాదించి పెట్టింది. బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 36వ వారం గణాంకాల ఆధారంగా, తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మైంట్‌ ఛానళ్లలో స్టార్‌ మా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 లాంచ్‌ అత్యధిక రేటింగ్స్‌ సాధించి పెట్టింది. రియాలిటీ షోల లాంచ్‌లు సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొంది. బార్క్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తొలివారం బిగ్ బాస్ లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించినట్లు పేర్కొంది. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ లాంచ్‌ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్‌ సాధించింది. లాంచ్‌ ఎపిసోడ్‌ 18.5 టీవీఆర్‌ నమోదు చేసింది.

నాన్‌ ఫిక్షన్‌ షో కేటగిరీలో బార్క్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్‌ సాధించిన లాంచ్‌ ఎపిసోడ్‌గా మాత్రమే కాదు బిగ్‌బాస్‌ తెలుగు తొలి సీజన్‌ నుంచి కూడా చరిత్రలో ఏ సీజన్‌లోనూ చూడనంతగా ఈ లాంచ్‌ ఎపిసోడ్‌ అత్యుత్తమ రేటింగ్‌ సాధించింది. గణాంకాలను బట్టి స్టార్‌ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో స్పష్టమైన లీడర్‌షిప్‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగవారాలతో పోలీస్తే స్టార్‌ మా సరికొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ 18 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ పేర్కొంది.

ఆది నుంచి హుషారెత్తిస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 రెండో వారం నుంచి కూడా అదే జోరు కనబరుస్తోంది. ఈ సీజన్ లో అంతా కొత్త కంటెస్టెంట్లు అయినప్పటికీ మంచి వినోదాన్ని అందిస్తున్నారు. అందరూ తమదైన ఎమోషన్స్ ను పండిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జంట మధ్య సాగుతున్న వ్యవహారం మరింత అసక్తిని కనబరుస్తుంది. అభిజిత్-మోనాలిక-అఖిల్ మరోవైపు అభిజిత్-హరిక, సుజాత-అభిజిత్, సోహెల్-అరియాణ ఈ జంట మధ్య లవ్ ట్రాక్స్…జంట మధ్య అప్పటికప్పడు కస్సుబుస్సులు రక్తి కట్టిస్తున్నాయి. ఇక, కెప్టెన్ గా లాస్య కుటుంబసభ్యుల మధ్య రాయబారాలు, నోయెల్ ర్యాంప్, గంగవ్వ పండిస్తున్న వినోదం… ఇలా ఎవరికి వాళ్లు మంచి ఎంటర్ టైన్మెంట్ పండిస్తున్నారు. ఈ పరంగా చూస్తే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. దీని బట్టి చూస్తే మునుముందు మరిన్ని బిగ్‌బాస్‌ -4 ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచిచాడాల్సిందే…

Follow Us