Bigg Boss 4: అరియానా, సోహైల్‌ మధ్య బిగ్‌ క్లాష్‌.. శత్రువులుగా మారిన మిత్రులు

బిగ్‌బాస్‌ హౌజ్‌లో వెళ్లిన కొందరు మంచి స్నేహితులుగా బయటికి వస్తే, మరికొందరు స్నేహితులు, శత్రువులుగా మారుతుంటారు

Bigg Boss 4: అరియానా, సోహైల్‌ మధ్య బిగ్‌ క్లాష్‌.. శత్రువులుగా మారిన మిత్రులు
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 7:05 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో వెళ్లిన కొందరు మంచి స్నేహితులుగా బయటికి వస్తే, మరికొందరు స్నేహితులు, శత్రువులుగా మారుతుంటారు. గత సీజన్‌లో రాహుల్, శ్రీముఖి ఇలానే బయటకు వచ్చారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లేముందు ఈ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కానీ హౌజ్‌లోకి వెళ్లిన తరువాత వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఒకానొక సమయంలో బయటికి వెళ్లిన తరువాత నీతో అస్సలు మాట్లాడను అంటూ శ్రీముఖి, రాహుల్‌తో చెప్పింది. ఇప్పుడు అలాంటి సీన్‌ నాలుగో సీజన్‌లో కూడా మొదలైంది.

అరియానా-సొహైల్‌.. ఈ ఇద్దరు మంచి స్నేహితులు కాగా ఇప్పుడు వీరిద్దరి మధ్య క్లాష్ స్టార్ట్ అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌లో టేబుల్ క్లీనింగ్ విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ రేగింది. ఉల్లిపాయల్ కట్ చేసిన తరువాత టేబుల్ క్లీన్ చేయి అని అరియానా సొహైల్‌కి చెప్పింది. అయితే దీనిపై సొహైల్ ఫైర్ అయ్యారు. నువ్వు నాకు చెప్పకు, ఆర్డర్లు వేయకు అంటూ రివర్స్ అయ్యారు.

అంతేకాదు ఎలిమినేషన్‌కి నామినేషన్లు మొదలైనప్పుడు అరియానాను నామినేట్ చేస్తూ సొహైల్ కొన్ని కారణాలు చెప్పారు. వాటిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీ గురించి నాకు తెలుసంటూ సొహైల్‌ అనగా.. నీ గురించి నాకు బాగానే తెలుసంటూ ఘాటుగా జవాబిచ్చారు. నా గురించి మాట్లాడటం నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. దీంతో ఫ్రెండ్స్ కాస్త ఎనిమీలుగా మారుతున్నారంటూ వీక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఇక నామినేషన్ల సమయంలో అఖిల్‌, కుమార్ సాయి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.

Read More:

“పేరు మారింది…” రాయగిరి కాదు యాదాద్రి రైల్వేస్టేషన్

విశ్వగురువుగా భారత్ : గవర్నర్‌ తమిళిసై

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!