Bigg Boss 4: మూడో ‘ఏ’తో మోనాల్‌ రొమాన్స్‌

ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్‌ చుట్టూ లవ్‌ స్టోరీ జరుగుతున్న విషయం తెలిసిందే. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే మోనాల్‌ విషయంలో అభిజిత్‌, అఖిల్‌ల

Bigg Boss 4: మూడో 'ఏ'తో మోనాల్‌ రొమాన్స్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2020 | 8:27 AM

Bigg Boss 4 Monal: ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్‌ చుట్టూ లవ్‌ స్టోరీ జరుగుతున్న విషయం తెలిసిందే. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే మోనాల్‌ విషయంలో అభిజిత్‌, అఖిల్‌ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. దీంతో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా మారింది. అంతేకాదు మోనాల్‌ని మనసులో పెట్టుకున్న ఈ ఇద్దరు నామినేషన్ జరిగే సమయంలోనూ అంత ప్రత్యేక కారణాలు లేకపోయినా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మోనాల్‌ కూడా ఇద్దరితో క్లోజ్‌గా ఉంటూ వస్తోంది. ఈ విషయంలో ఆ మధ్యన దివి, మోనాల్‌కి గట్టి క్లాస్‌ పీకింది. నీ వలనే వారిద్దరు అలా అవుతున్నారంటూ మొహం మీదే చెప్పేసింది. బయట కూడా ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీపై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అభి, అఖిల్‌ కూడా నువ్వేంటో అర్థం కావు అన్నట్లు మాట్లాడేసి, కాస్త దూరంగా ఉంటున్నారు.

ఇక వారిద్దరి తీరుతో మోనాల్‌ కూడా మారిపోయినట్లుగా అనిపిస్తోంది. అభి, అఖిల్‌ని పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు మూడో ‘ఏ’కు క్లోజ్‌గా అవుతోంది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డు ఇచ్చిన అవినాష్‌తో మోనాల్‌ రాను రాను దగ్గరవుతోంది. మొదట్లో అతడంటేనే నచ్చనట్లు ప్రవర్తించిన మోనాల్‌.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అవినాష్‌తో ప్రియా.. ప్రియా అంటూ డాన్స్ నేర్పించి మరీ.. రొమాంటిక్ స్టెప్పులు వేసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుని రచ్చ చేశారు. నాతో డాన్స్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి అంటూ అవినాష్‌ని గట్టిగా వాటేసుకుంది మోనాల్‌. అయితే చూసేవారికి ఇది కాస్త ఓవర్‌గా అనిపించింది.

Read More:

విషమంగా నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం

Bigg Boss 4: అమ్మాయిల నైట్‌ ఔట్ పార్టీ.. సొహైల్‌, అఖిల్‌ని ఆడుకున్నారుగా