Bigg Boss 4: అమ్మాయిల నైట్‌ ఔట్ పార్టీ.. సొహైల్‌, అఖిల్‌ని ఆడుకున్నారుగా

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌజ్‌లోని అమ్మాయిలకు నైట్‌ ఔట్ పార్టీ చేసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. దీంతో అబ్బాయిలను ఆడుకునేందుకు అమ్మాయిలు ప్లాన్ చేసుకున్నారు

Bigg Boss 4: అమ్మాయిల నైట్‌ ఔట్ పార్టీ..  సొహైల్‌, అఖిల్‌ని ఆడుకున్నారుగా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2020 | 7:39 AM

Ladies Night Out Party: శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌజ్‌లోని అమ్మాయిలకు నైట్‌ ఔట్ పార్టీ చేసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. దీంతో అబ్బాయిలను ఆడుకునేందుకు అమ్మాయిలు ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అభిజిత్‌ను తమ రూమ్‌లోకి పిల్చుకుని పొగిడించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అమ్మాయి న‌చ్చుతుందని అభిజిత్‌ని ప్ర‌శ్నించారు. అమ్మాయి లెవ‌ల్ హెడెడ్‌గా, నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ నిర్ణ‌యాలు తీసుకోగల‌గాలి అని చెప్పాడు. ఇక ఇక్కడున్న వాళ్ల‌లో ఎవ‌రితో డేట్‌కు వెళ్తావని అభి అడగ్గా.. అరియానా పేరు చెప్పాడు. దీంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. అభిపై కాస్త ఇంట్రస్ట్‌ ఎక్కువ చూపుతున్నట్లు అనిపించింది.

ఆ తరువాత మాస్ట‌ర్‌ని లోనికి ర‌మ్మ‌న్నారు. తాము పాడే పాటలకు అమ్మాయిలా డ్యాన్స్ చేయాలంటూ టీజ్ చేశారు. అనంతరం సొహైల్ లుంగీ కట్టుకుని వచ్చి ఊర మాస్ గెటప్‌లో తాగుబోతులా అలరించాడు. అక్క‌డున్న అమ్మాయిలంద‌రి గురించి త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. దివి, హారిక, అరియానాలకు పొగరు అదీ ఇదీ అన్నాడు. దీంతో సొహైల్ లుంగీ లాగారు. దీంతో మీకు అన్న‌ద‌మ్ముల్లేరా అని సొహైల్‌ ప్ర‌శ్నించ‌డంతో హారిక‌ వ‌దిలేసింది. కానీ తమకు సారీ చెప్పాల‌ని వారందరూ ప‌ట్టు ప‌ట్టినా సొహైల్‌ మాత్రం చెవికెక్కించుకోలేదు. త‌ర్వాత అరియానా సోహైల్‌తో అమ్మాయిలా క్యాట్ వాక్ చేయించింది.

ఆ తరువాత ఆఖిల్‌ని రమ్మని ఆటాడుకున్నారు. అతడితో ముగ్గులు వేయించారు. అరియానా అయితే అఖిల్‌కి భర్తగా బాగా జీవించింది. ముద్దు పెట్టానా..? సాయత్రం మల్లెపూలు తీసుకురానా..? సినిమాకి వెళ్దామా అంటూ అతడిని ఆడుకుంది. చివర్లో స్వింగ్ జరా పాటతో అమ్మాయిలు అబ్బాయిలు స్టెప్పులతో రచ్చ చేశారు. బిగ్ బాస్ హౌస్‌ను పబ్‌లా మార్చేసి అందరూ చిందులు వేశారు.

Read More:

Bigg Boss 4: రేసర్ ఆఫ్‌ ది హౌజ్‌‌.. విజేతగా మెహబూబ్.. వారిని అభినందించాల్సిందే

కత్తి కార్తీక పై చీటింగ్ కేసు