Bigg Boss 4: రేసర్ ఆఫ్‌ ది హౌజ్‌‌.. విజేతగా మెహబూబ్.. వారిని అభినందించాల్సిందే

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు రేసర్ ఆఫ్‌ ద హౌజ్‌ అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులంతా ఫుష్ అప్‌లు తీయాలని అమ్మాయిలు, అబ్బాయిలకు కలిపి ఫస్ట్ రౌండ్ ఇచ్చారు బిగ్‌బాస్

Bigg Boss 4: రేసర్ ఆఫ్‌ ది హౌజ్‌‌.. విజేతగా మెహబూబ్.. వారిని అభినందించాల్సిందే
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2020 | 7:12 AM

Bigg Boss 4 Telugu: శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు రేసర్ ఆఫ్‌ ద హౌజ్‌ అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యులంతా ఫుష్ అప్‌లు తీయాలని అమ్మాయిలు, అబ్బాయిలకు కలిపి ఫస్ట్ రౌండ్ ఇచ్చారు బిగ్‌బాస్‌. మొద‌టి రౌండ్‌లో ఎక్కువ పుష‌ప్స్ చేసిన మొదటి ఐదుగురు.. రెండో రౌండ్‌కు అర్హ‌త సాధిస్తారని చెప్పాడు. ఇక ఆ రౌండ్‌లో ఏడు అడ్డంకుల‌ను త‌క్కువ స‌మ‌యంలో దాటాల్సి ఉంటుంది. టైర్ల మ‌ధ్య నుంచి దూక‌డం, తాళ్ల మ‌ధ్య‌లో నుంచి దాట‌డం, ఇసుక మూట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ఒక‌వైపు నుంచి మ‌రొక‌వైపుకు తీసుకెళ్ల‌డం, ఏట‌వాలుగా ఉన్న‌దానిపై న‌డ‌వ‌డం, ముళ్ల కంచె కింద నుంచి పాకడం, మార్బుల్స్ మీద ప‌రిగెత్త‌డం, మంకీ బాస్‌ను చేతులతో ప‌ట్టుకుని వేలాడ‌టం వంటివి చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అవన్నీ చేయలేక అమ్మాయిలందరూ మొదటి రౌండ్ మ‌ధ్య‌లోనే చేతులు ఎత్తేశారు.

ఇక కుమార్ సాయి, అఖిల్‌, మెహ‌బూబ్‌, సోహైల్‌, నోయ‌ల్‌లు పుషప్స్‌ ఎక్కువగా చేసి తరువాతి రౌండ్‌కి అర్హత సాధించారు. అయితే పుష‌ప్స్ చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో ఆగావ‌ని నోయ‌ల్, కుమార్‌సాయిని త‌ప్పుప‌ట్టాడు. తానేం ఆగలేదని కుమార్ సాయి బుకాయించాడు. అయితే ఒక్క‌రోజైనా నిజం చెప్పమ‌ని, నిజాయితీగా ఉండ‌మ‌ని కుమార్ సాయికి నోయల్‌ ఘాటు స‌ల‌హా ఇచ్చాడు. ఇక ఈ టాస్క్‌లో తాను ఆడనని నోయ‌ల్‌ త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో అవినాష్ రెండో రౌండ్‌లోకి దిగాడు. కానీ మధ్యలో కింద పడిపోయినప్పటికీ, తన ఆటను కంటిన్యూ చేశాడు. ఆటలో ఓడినా మంచి ఎఫర్ట్ పెట్టి ఆడాడు. ఇక ఈ టాస్క్‌లో మెహ‌బూబ్ మాత్రం రేసుగుర్రంలా 49 సెకండ్ల‌లో టాస్క్ పూర్తి చేశాడు. దీంతో “రేస‌ర్ ఆఫ్ ద హౌస్‌”గా నిలిచాడు. ఇక కుమార్‌, అఖిల్‌, సోహైల్ స్వ‌ల్ప సెకండ్ల తేడాతో ఓటమి చెందారు. టాస్క్‌ పూర్తైన తరువాత తాను 105 పుష‌ప్స్ చేస్తే దాని గురించి మెహ‌బూబ్ త‌క్కువ చేసి మాట్లాడాడ‌ని అఖిల్ ఫీల‌య్యాడు. ఆ కోపం సోహైల్ మీద తీశాడు. విషయం తెలుసుకున్న మెహబూబ్‌ వచ్చి సారీ చెప్పినా.. ఏడుపు మొహం పెట్టి తెగ బాధపడ్డాడు.

అయితే ఈ టాస్క్‌ ఫిజికల్‌గా చేయాల్సింది కాగా.. అందరికీ సాధ్యం కానిది. ఇందులో నైపుణ్యం ఉన్న వారు మాత్రమే చేయగలరు. అలాంటిది మొదటి రౌండ్‌లో అమ్మాయిలు కూడా పాలు పంచుకోవడం, రెండో రౌండ్‌లోనూ అవినాష్‌ కింద పడినప్పటికీ మళ్లీ ఆట కంటిన్యూ చేయడం నిజంగా అభినందించాల్సిన అంశం.

Read More:

నేటి నుంచి బెజవాడ దుర్గమ్మ దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు

యాదాద్రి టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్‌ని అభినందించిన జనసేనాని

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు