విషమంగా నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం

తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. న్యూమోనియా కారణంగా హైదరాబాద్‌లోని

విషమంగా నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2020 | 8:03 AM

Naini Narshimha Reddy : తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. న్యూమోనియా కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా గత నెలలో నాయిని కరోనా బారిన పడగా.. దాని నుంచి కోలుకున్నారు. ఆ తరువాత ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. అందులో న్యూమోనియా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కాగా మరోవైపు నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకి కోలుకుంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో అహల్య ఉన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఈ వైరస్‌కు బాధితులవుతున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యాధిపై పోరాటం చేసి విజయవంతంగా కోలుకోగా… కొందరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

Read More:

Bigg Boss 4: అమ్మాయిల నైట్‌ ఔట్ పార్టీ.. సొహైల్‌, అఖిల్‌ని ఆడుకున్నారుగా

Bigg Boss 4: రేసర్ ఆఫ్‌ ది హౌజ్‌‌.. విజేతగా మెహబూబ్.. వారిని అభినందించాల్సిందే