Bigg Boss 4: మా ముగ్గురి టాపిక్ తేవొద్దు.. కుళాయి విప్పేసిన మోనాల్
సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఎప్పటిలాగే మోనాల్ తన కుళాయిని తిప్పేసింది
Bigg Boss 4 Monal: సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఎప్పటిలాగే మోనాల్ తన కుళాయిని తిప్పేసింది. మొదట నామినేషన్ చేసే సమయంలో.. అభిజిత్‌కి, తనకు మధ్య ఉన్న చిన్న గొడవను 50 రెట్లు ఎక్కువ చేశావనిపించింది అని మెహబూబ్‌ని మోనాల్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఆరో వారంలో తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లాస్యను తన కోసం వండమని అడిగానని.. కానీ నన్నే చేసుకోమని చెప్పిందని, అందుకే లాస్యను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై లాస్య మాట్లాడుతూ.. అప్పుడు నేను బిజీగా ఉన్నా. వేరే వాళ్లకు చెప్పొచ్చు కదా అని అసహనం ప్రదర్శించింది. ఇక ఆ ఇద్దరిని నామినేట్ చేసిన తరువాత మోనాల్ మళ్లీ ఏడ్చేసింది. ఇంట్లో సభ్యులు ఎవరూ ఇకపై అఖిల్, అభిజిత్, మోనాల్ టాపిక్ తీసుకురావొద్దని వేడుకుంది.
Read More:
Bigg Boss 4: ఎనిమిదో వారం ఎలిమినేషన్.. నామినేట్ అయిన ఆరుగురు
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ..