Bigg Boss 4: ఎనిమిదో వారం ఎలిమినేషన్.. నామినేట్ అయిన ఆరుగురు
బిగ్‌బాస్ 4లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ జరిగింది. నామినేట్ చేయాలనుకున్న సభ్యుల ఫొటోలను సుత్తితో పగలగొట్టాలని
Bigg Boss 4 Elimination Nomination: బిగ్‌బాస్ 4లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ జరిగింది. నామినేట్ చేయాలనుకున్న సభ్యుల ఫొటోలను సుత్తితో పగలగొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా వచ్చిన లాస్య.. అమ్మ రాజశేఖర్, మోనాల్‌ని నామినేట్ చేసింది. ఆ తరువాత అఖిల్.. అరియానా, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని నామినేష్ చేశాడు. మెహబూబ్.. అరియానాను, మోనాల్‌ని నామినేట్ చేశాడు.
అవినాష్.. లాస్య, హారికలను నామినేట్ చేశాడు. ఆ తరువాత అమ్మ రాజశేఖర్ మాస్టర్.. అఖిల్, లాస్యలను నామినేట్ చేశాడు. ఇక అరియాన.. మెహబూబ్, అఖిల్‌ని నామినేట్ చేసింది. ఆ తరువాత సొహైల్.. అరియానా, రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేశాడు. ఇక నోయల్.. మెహబూబ్, అఖిల్‌ని.. అలాగే అభిజిత్.. మోనాల్, అమ్మా రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేశారు. ఆ తరువాత హారిక.. అరియానా, మెహబూబ్‌ని, మోనాల్.. మెహబూబ్, లాస్యలను నామినేట్ చేశారు. ఇలా ఈ వారం నామినేషన్‌కి గానూ అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ నామినేట్ అయ్యారు.
Read More: