నాయిని సతీమణి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. అహ‌ల్య కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

  • Sanjay Kasula
  • Publish Date - 12:35 am, Tue, 27 October 20

CM KCR Mourns  : దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి  కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. అహ‌ల్య కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. సీఎంతోపాటు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, అజ‌య్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌, ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప‌‌లువురు ప్ర‌జాప్రతినిధులు తమ సంతాపం ప్ర‌క‌టించారు.

దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి సతీమణి నాయిని అహల్య (68) అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆమెకూ కరోనా సోకింది. అయితే ఆ తర్వాత అహల్యకు నెగటివ్‌ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఈరోజు మృతిచెందారు. ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.