రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ..

రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి..

  • Ravi Kiran
  • Publish Date - 7:08 am, Tue, 27 October 20

YSR Rythu Bharosa: అకాల వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. రెండో విడత కింద రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది.

కాగా, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు లబ్ధిదారుల సంఖ్య 49,45,470 ఉండగా.. ఇప్పుడు రబీ సమయానికి అది కాస్తా 50,47,383కి చేరింది. అంటే కొత్తగా మరో 1,01,913 మంది సాయం పొందనున్నారు. ఇక 50,47,383 మంది రైతులకు గాను రూ. 1,114.87 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకు కూడా రూ. 11,500 వేల చొప్పున  ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!