Bigg Boss 4: ఫీలైన అఖిల్‌.. గోరు ముద్దలు తినిపించిన మోనాల్‌

బిగ్‌బాస్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా అభి, మోనాల్‌ మధ్య కాస్త దూరం పెరగ్గా

Bigg Boss 4: ఫీలైన అఖిల్‌.. గోరు ముద్దలు తినిపించిన మోనాల్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 26, 2020 | 9:50 AM

Monal cools Akhil: బిగ్‌బాస్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా అభి, మోనాల్‌ మధ్య కాస్త దూరం పెరగ్గా.. హారికకు అభి దగ్గరయ్యాడు. అయితే మనసు నుంచి మాత్రం మోనాల్‌ని తీయలేకపోతున్నారు. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో అందరూ డ్యాన్స్‌లు చేస్తుండగా.. హారికకు గ్యాప్ ఇచ్చిన అభి, మోనాల్‌ని ఎవరూ తిరగని చోటుకు తీసుకెళ్లి రహస్యంగా ముచ్చట్లు పెట్టాడు.

నోయెల్‌తో ఏం మాట్లాడావని మోనాల్‌ని అభి అడిగాడు. నేను నిన్ను లైక్ చేశానని చెప్పానని మోనాల్ చెప్పగా.. అభి చాలా ఎగ్జైట్ అయ్యాడు. నాకు చెప్పవే అవన్నీ అంటూ హ్యాపీగా ఫీలయ్యాడు. మరోవైపు అభి-మోనాల్‌లు దగ్గరైన విషయంపై అఖిల్‌ తెగ ఫీల్ అయ్యాడు. ఇక అభితో ముచ్చట్లు ముగిసిన వెంటనే షిఫ్ట్ మారి, మళ్లీ అఖిల్‌ దగ్గరకు వచ్చేసింది మోనాల్‌. ఏమైంది నీకు అంటూ అతడితో ముచ్చట్లు పెట్టింది. అందుకు.. పెళ్లి చేసుకోవడానికి బిగ్‌బాస్ రావట్లేదు అంటూ అఖిల్‌ తెగ ఫీల్‌ అయ్యాడు. ఆ తరువాత అఖిల్‌కి సారీ చెప్పింది మోనాల్‌. అంతేకాదు అతడిని కూల్ చేసేందుకు రాత్రి గోరుముద్దలు తినిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read more:

Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ ఫ్లెడ్జ్‌.. దూరంగా అభి, అఖిల్

IPL 2020 , KKR vs SRH..నువ్వా.. నేనా తేల్చుకుందాం..!