Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • ఖుష్బూ ట్వీట్‌ : మహిళల ఆత్మగౌరవం కోసం నా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడుతాను .మోదీ ఎప్పుడూ మహిళల రక్షణ గురించి ఆలోచిస్తుంటారు .మేం ఆయన బాటలో నడుస్తాం .మహిళల మీద జరిగే దాడులను ఎప్పటికీ సహించం .శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఎందుకు అంగీకరించరు? .మిగిలిన పార్టీలకు ఇచ్చే పర్మిషన్లు మాకెందుకు ఇవ్వరు? .మన ప్రయాణాన్ని మధ్యలో బలవంతంగా ఎవరో ఆపుతున్నారంటే... మనం సరైన బాటలో ఉన్నట్టే.
  • చెన్నై : సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్ . వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేఖం గా ఆందోళనలకు పిలుపునిచ్చిన బిజెపి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరం లో బిజెపి ఆందోళనలు . ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూ ని ఈసీఆర్ రోడ్డు లో అరెస్ట్ చేసిన పోలీసులు.
  • విజయనగరం : నేడే ఉత్తరాంధ్ర కొంగుబంగారం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ. సాయంత్రం నాలుగు గంటలకు భక్తులకు దర్శనమివ్వనున్న సిరిమాను. ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. సిరిమాను ఉత్సవం కు సర్వం సిద్ధం.

IPL 2020 , KKR vs SRH..నువ్వా.. నేనా తేల్చుకుందాం..!

మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నుంచి అభిమానులు...

KKR vs SRH Dream11, IPL 2020 , KKR vs SRH..నువ్వా.. నేనా తేల్చుకుందాం..!

ఆ రెండు జట్లు నువ్వా నేనా అని కసి కసిగా రంగంలోకి దూకనున్నాయి. ఒకరిది ఆరాటం.. మరొకరిది పోరాటం. గెలిస్తే పాయిట్ల పట్టికలో భోణీ కొడతారు.. మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

గాయం కారణంగా లీగ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌ స్థానంలో జాసెన్‌ హోల్డర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, ప్రియం గార్గ్‌ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. తొలి మ్యాచ్‌లో దొర్లిన తప్పులను సరిదిద్దుకొని రెండో పోరుకు సిద్ధంగా ఉన్నామని వార్నర్‌ అంటుంటే.. మరోవైపు కోల్‌కతా కూడా విజయంపై కన్నేసింది. ముంబై చేతిలో ఓడిన కార్తీక్‌ సేన ఈ మ్యాచ్‌ నెగ్గి పాయింట్ల పట్టికలో ఖాతా తెరువాలని చూస్తోంది.

Related Tags