Bigg Boss 4: లాస్య ఎలిమినేటెడ్.. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే
బిగ్‌బాస్ 4లో మరో ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించనట్లుగానే ఈ వారం లాస్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు
Lasya Manjunath eliminated: బిగ్‌బాస్ 4లో మరో ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించనట్లుగానే ఈ వారం లాస్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో లాస్య స్టేజ్ మీదికి రాగా.. ఆమె బిగ్‌బాస్ జర్నీని చూపించారు నాగ్. ఇక హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని లాస్యకు సూచించారు.
దీంతో మొదట అవినాష్‌తో మొదలుపెట్టింది లాస్య. అవినాష్ మంచి ఎంటర్‌టైనర్ అని, అతడు పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడతాడని, కానీ నామినేషన్ దగ్గరకి వచ్చేసరికి తనను ఎవరైనా ఒక మాటంటే చాలా ఫీలవుతాడని లాస్య చెప్పింది. ఇక గేమ్ చాలా బాగా ఆడుతున్నావు. నిన్ను టాప్ 5లో చూడాలనుకుంటున్నా అని అవినాష్‌కి సూచించారు.
ఆ తరువాత మోనాల్ గురించి మాట్లాడుతూ.. ఆమె బాగా ఆడుతుంది. కాకపోతే ఒక్కోసారి కన్ఫ్యూజన్‌లో ఉంటుంది. భా అర్థం కాకనో లేకపోతే ఎవరైనా ఏమన్నా అంటారనో తెలీదు గానీ కొన్ని సార్లు మోనాల్ కన్ఫ్యూజన్‌లో ఉంటుంది. కానీ మోనాల్ చాలా స్ట్రాంగ్ అని లాస్య తెలిసారు. ఇక అరియానా గురించి చెబుతూ.. ఒక టాస్క్‌లో నన్ను నామినేట్ చేయడానికి అరియానా పరిగెడుతూ పడిపోతూ దెబ్బలు తగిలించుకుని మరీ వెళ్లింది. అది నాకు బాగా నచ్చింది. అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుంది. కానీ బోల్డ్‌గా మాట్లాడే మాటల్లో రాంగ్ ఉన్నప్పుడు ఒప్పుకోవాలి అని అరియానాకు సూచించింది.
ఆ తరువాత సొహైల్ గురించి చెబుతూ.. అతడికి నరాలు, కోపం ముక్కు మీదే ఉంటాయి. ఒక్కోసారి గొడవలు లేకపోతే అక్కా గొడవలు పెట్టుకుందామా అని అడుగుతుంటాడు. ఎంత కోపం ఉంటుందో అంతే త్వరగా కరుగుతాడు. ఏదైనా మ్యాటర్‌ని సెటిల్ చేసుకుని కూల్ అయిపోయే వరకు నిద్రపోడు. కోపాన్ని తగ్గించుకో తమ్ముడు. అంతకంటే ఏం లేదు. చాలా బాగా ఆడుతున్నావు. అదే కంటిన్యూ చేయి అని లాస్య చెప్పుకొచ్చింది.
ఇక అఖిల్ గురించి చెబుతూ.. అతడు బాగా ఆడుతున్నాడని, కాకపోతే నామినేషన్ సమయంలో బాగా కోపం వచ్చేస్తుందని అన్నారు. ఆ సమయంలో ఎదుటివారు చెప్పింది వినాలని, నీ పాయింట్ రైట్ ఉండొచ్చు. కానీ ఓపికగా ఎదుటివారు చెప్పింది విని తరువాత రెస్పాండ్ అయితే బావుంటుంది అని లాస్య తెలిపారు. ఇక తన ఫేవరెట్ అభిజిత్ గురించి చెబుతూ.. హౌస్ మొత్తంలో తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అభి అని తెలిపారు. తేడాలు చూపించడు, అందరినీ సమానంగా చూస్తాడు అని చెప్పుకొచ్చింది. చివరగా హారిక చాలా అల్లరి పిల్ల అని, తనతో సమయాన్ని గడపడం చాలా ఇష్టమని చెప్పింది. కానీ హారిక చాలా గట్టి పిల్ల, దేన్నైనా పట్టుబట్టి సాధిస్తుందని కొనియాడారు. ఇక అభిజిత్, సొహైల్ టాప్ 2లో ఉంటారని తెలిపారు.