Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్.. బిగ్‌బాంబ్ అతడిపైనే
బిగ్‌బాస్ 4లో 11వ వారానికి గానూ లాస్య ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్‌ని హార్ట్‌గా తీసుకోని లాస్య.. నవ్వుతూనే స్టేజ్‌పైకి వచ్చింది.
Lasya Big Bomb Abhijeet: బిగ్‌బాస్ 4లో 11వ వారానికి గానూ లాస్య ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్‌ని హార్ట్‌గా తీసుకోని లాస్య.. నవ్వుతూనే స్టేజ్‌పైకి వచ్చింది. ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌లు అందరి గురించి పాజిటివ్, నెగిటివ్‌లు చెప్పింది. ఇక తనకు నచ్చిన అభి, హారిక గురించి మాత్రం పెద్దగా నెగిటివ్‌లు చెప్పలేదు. ముఖ్యంగా అభి అంటే తనకు అత్యంత ఇష్టమని వెల్లడించింది. అయితే కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్‌కి ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాలన్న బిగ్‌బాస్ అభిజిత్ మీద పడింది. అయితే తాను బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటి మాత్రమే చేస్తానని అభిజిత్ చెప్పుకొచ్చారు.