Bigg Boss4: అఖిల్‌, మెహబూబ్‌కి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్‌

గత వారం కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో.. కొత్త కెప్టెన్ కోసం బిగ్‌బాస్ టాస్క్‌ని ఇచ్చారు

Bigg Boss4: అఖిల్‌, మెహబూబ్‌కి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 11, 2020 | 7:34 AM

Captaincy Task Bigg Boss 4: గత వారం కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో.. కొత్త కెప్టెన్ కోసం బిగ్‌బాస్ టాస్క్‌ని ఇచ్చారు. దాన్ని కాస్త ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేశారు. ఇంటి సభ్యులందరి ఫొటోలతో ఉన్న బాస్కెట్ బాల్‌లను ఒక్కొక్కరూ ఒక్కొక్కటి తీసుకోవాలని.. అయితే ఎవరి బాల్‌ వాళ్లు తీసుకోకుండా, పక్కనున్న వాళ్లది తీసుకుని బజర్ మోగే సమయంలో బాస్కెట్‌లో వేయాలని, ఎవరిదైతే అందరికంటే చివరగా బాస్కెట్‌లో పడుతుందో వాళ్లు గేమ్ నుంచి తప్పుకుంటారని, ఫైనల్‌గా మిగిలిన వారే కెప్టెన్ పోటీదారులు అవుతారని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ గేమ్‌లో అభిజిత్‌ మైండ్‌ గేమ్ ఆడాడు. అత‌డు, హారిక క‌లిసి త‌మకు గిట్ట‌ని వ్య‌క్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాల‌ని ఆల‌స్యం చేశారు.

ఈ క్రమంలో మొదట లాస్య, ఆ తరువాత అరియానా, మోనాల్, అభిజిత్‌ వీరందరూ గేమ్ నుంచి ఔట్ అవ్వగా.. చివరకు మెహబూబ్, అఖిల్, సొహైల్‌లు మిగిలారు. అయితే సొహైల్ ఆల్రెడీ కెప్టెన్ కావడంతో మెహబూబ్, అఖిల్‌ కోసం త్యాగం చేశాడు. అయితే అఖిల్-మెహబూబ్‌లు కెప్టెన్ అవ్వడం కోసం ఆటను పెంట పెంట చేశారు.

‘తాను నామినేషన్స్‌లో ఉన్నా కాబట్టి కెప్టెన్ అయితే పర్ఫామెన్స్‌ చేయడానికి అవకాశం లభిస్తుందని, ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేదు కాబట్టి తనకు సపోర్ట్ చేయాలని మెహబూబ్‌ రిక్వెస్ట్ చేశాడు. అయితే దానికి అఖిల్ ససేమిరా అన్నాడు. నేను కెప్టెన్ అవుతా అంటూ బాస్కెట్‌లో వేయాల్సిన బాల్‌ని కింద పడేసి ఎక్కడ పడినా గెలిచినట్టే అంటూ ఏదో ఇష్టం వచ్చినట్లుగా గేమ్ ఆడాడు. అయితే బాల్ వేయాల్సింది బాస్కెట్‌లోనని, తన చేతుల్లో నుంచి బాల్ లాక్కొని కింద వేసినంత మాత్రాన గేమ్ గెలిచినట్లు కాదని మెహబూబ్‌ చెప్పాడు.

ఇక ఈ ఇద్దరూ ఒకరి బాల్ ఒకరు పట్టుకోవాల్సి ఉండగా, ఎవరి బాల్ వాళ్లే పట్టుకుని కెప్టెన్ నేనే అవుతా నేనే అవుతా అంటూ ఇద్దరూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో బిగ్ బాస్ వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ టాస్క్‌ని రద్దు చేసి, మెహబూబ్‌, అఖిల్‌ని హెచ్చరించారు. ఈ వారం ముగిసే వరకు ఎవ్వరూ కెప్టెన్‌గా ఉండరని తేల్చేశారు. దీంతో అఖిల్‌ కోపంలో ఊగిపోయాడు. అన్నీ నీకే కావాలంటావు, నేను తగ్గలా అంటూ సొహైల్ ముందు ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఫ్రెండ్‌ షిప్‌, బాండింగ్, రిలేషన్ ఏం ఉండదు. అందరూ నటిస్తారు. బక్వాజ్ గేమ్ అంటూ అఖిల్‌ ఓ రేంజ్‌లో చిందులు తొక్కాడు. దీంతో మీ ఇద్దరి కోసం నేను గేమ్ వదిలేస్తే, మీరు ఇగోలకు పోయి గేమ్‌ని పోగొట్టారు అని సొహైల్ బాధపడ్డాడు.